చెవిలో సాలీడు కుటుంబం.. తీవ్ర నొప్పితో ఆస్పత్రిలో చేరిన మహిళ

 చెవిలో సాలీడు కుటుంబం.. తీవ్ర నొప్పితో ఆస్పత్రిలో చేరిన మహిళ

చెవిలోకి చిన్న చీమ వెళ్తేనే ఆ సమస్య తీరే వరకూ కనీసం నిద్ర కూడా పట్టదు. ఏం చేసినా, ఎక్కడున్నా ధ్యాసంతా ఆ చెవి మీదే ఉంటుంది. ఇలా ఒక్క చెవిలోకే కాదు.. కొన్ని సార్లు దోమలు, చిన్న చిన్న పురుగులు కంట్లోకి, ముక్కుల్లోకి వెళ్తుండడం చూస్తూనే ఉంటాం. ఇలాంటివి జరిగినప్పుడు చిన్నదే కదా... పోతుందిలే అని చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ  వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి ఈ సమస్య నుండి బయటపడాలి. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ తరహా విషయాన్ని నిరూపిస్తూ.. చైనాలో ఓ ఘటన చోటు చేసుకుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

చైనాలోని సిచువాన్‌లో ఓ మహిళ.. చెవిలో విపరీతమైన నొప్పి వస్తోందని.. డాక్టర్ వద్దకు వెళ్లింది. చెవి లోపలి భాగాన్ని చూసిన డాక్టర్ ఒక్కసారిగా చలించిపోయాడు. ఆమె చెవిలో చోటుచేసుకున్న సమస్య చూసి షాక్ కు గురయ్యాడు. ఇంతకీ ఏమైందంటే... ఆ మహిళ చెవిలో ఓ సాలీడు కుటుంబమే గూడు కట్టుకుంది. ఈ విషయం ఆమెకు కూడా తెలియదు.

మహిళ చెవిలో వాయిస్.. 

చైనాలో నివసిస్తోన్న 40 ఏళ్ల మహిళ తన చెవిలో వింత శబ్దాలు వస్తున్నాయని కొన్న రోజులుగా బాధపడుతోంది. కుడి చెవిలో ఈ శబ్దం రావడంతో మహిళ ఆసుపత్రికి వెళ్లింది. ఆ తర్వాత ఆమె పరిస్థితిని గమనించిన వైద్యులు.. ఆమెకు టిన్నిటస్ అనే వ్యాధి ఉందని గుర్తించారు. కానీ ఆ తర్వాత అర్థమయ్యిందేందంటే.. ఈ వింత శబ్దానికి, నొప్పికి కారణం ఏంటంటే సాలీడే.