
కోదాడ, వెలుగు: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి దుండగులు పుస్తెలతాడును చోరీ చేశారు. కోదాడ రూరల్ పోలీసుల వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట గ్రామానికి చెందిన శిరంశెట్టి సరస్వతి శుక్రవారం తనకున్న బర్రెలను మేపేందుకు వెళ్లింది. తిరిగి తన గ్రామం వైపు వెళ్తుండగా అశోక్ లీలాండ్ షోరూం వద్ద స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల పుస్తెలతాడు లాక్కున్నారు. ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారు అయ్యారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు.