అత్యాచారం చేసి చంపి.. సెప్టిక్​ ట్యాంకులో పడేసిన్రు

V6 Velugu Posted on Jun 09, 2021

పర్వతగిరి, వెలుగు: మహిళపై అత్యాచారం చేసి చంపి ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోని సెప్టిక్​ ట్యాంకులో పడేసిన ఘటన వరంగల్​రూరల్​ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలో మంగళవారం వెలుగుచూసింది. మామునూర్ ​ఏసీపీ నరేశ్​కుమార్​ వివరాల ప్రకారం.. అన్నారానికి చెందిన మహిళ(50) ప్రతి శుక్రవారం అన్నారంలో జరిగే కందూర్ల వద్దకు వెళ్లి అక్కడ అన్నం, డబ్బులు అడుక్కుంటుంది. ఈ క్రమంలో ఈ నెల 4న ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. తెల్లవారి కుటుంబసభ్యులు గ్రామంలో వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో ఈ నెల 6న ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగించారు. పక్కా సమాచారం మేరకు అన్నారంలోని పోడేటి సారయ్య ఇంట్లో ని సెప్టిక్​ ట్యాంకులో శవం ఉన్నట్లు తెలిసింది. శవాన్ని బయటకు తీసి ఘటనా స్థలంలోనే ఇద్దరు డాక్టర్లతో పోస్టుమార్టం నిర్వహించారు. ఇద్దరు అత్యాచారం చేసి చంపేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు ఏసీపీ చెప్పారు. 
 

Tagged woman, Rape, killed, Warangal, septic tank

Latest Videos

Subscribe Now

More News