మేయర్ ఎన్నికపై సుప్రీం కోర్టుకెళ్లిన ఆప్

మేయర్ ఎన్నికపై సుప్రీం కోర్టుకెళ్లిన ఆప్
  • మేయర్ అభ్యర్థి షెల్లీ పిటిషన్  నేడు విచారించనున్న కోర్టు!

న్యూఢిల్లీ : ఢిల్లీ మేయర్ ఎన్నిక రెండు సార్లు వాయిదాపడటంతో ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మేయర్ అభ్యర్థిని ఎన్నుకునేందుకు సభ నిర్వహించినప్పుడల్లా కొందరు గందరగోళం సృష్టిస్తున్నారని ఆప్ మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ తన పిటిషన్​లో పేర్కొన్నారు. నిర్ణీత సమయంలోపు మేయర్​ను ఎన్నుకునేలా ప్రిసైడింగ్ ఆఫీసర్​కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ఇప్పటికే వాయిదా పడగా మేయర్ ఎన్నికపై మళ్లీ సభ ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ప్రిసైడింగ్ ఆఫీసర్ క్లారిటీ ఇవ్వలేదన్నారు. కావాలనే ఎన్నికను బీజేపీ అడ్డుకుంటోందని ఒబెరాయ్, లీడర్ ఆఫ్ హౌస్ ముఖేశ్ గోయల్ పిటిషన్​లో వివరించారు. లెఫ్టినెంట్‌‌‌‌ గవర్నర్‌‌‌‌ నామినేట్‌‌‌‌ చేసిన 10 మంది కౌన్సిలర్లకు ఓటింగ్‌‌‌‌ అర్హత లేదని, అది చట్టవిరుద్ధమని తెలిపారు. వాళ్లను ఓటింగ్‌‌‌‌లో పాల్గొనకుండా నిలువరించాలని పిటిషన్‌‌‌‌లో కోరారు. పిటిషన్ శుక్రవారం విచారణ కు వచ్చే అవకాశం ఉంది.