IPL 2024: ఇంత షాక్ ఇచ్చాడేంటి: ఐపీఎల్ నుంచి తప్పుకున్న వరల్డ్ స్టార్ స్పిన్నర్

IPL 2024: ఇంత షాక్ ఇచ్చాడేంటి: ఐపీఎల్ నుంచి తప్పుకున్న వరల్డ్ స్టార్ స్పిన్నర్

2024 ఐపీఎల్ సీజన్ లో ఆసక్తి చూపించే విదేశీ ప్లేయర్లు తగ్గిపోతున్నారు. వరుస పెట్టి స్టార్ ప్లేయర్లు ఈ మెగా లీగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నారు. ఇంగ్లాండ్ ప్లేయర్లు అనుకుంటే ఇప్పుడు ఆసీస్ స్టార్ ప్లేయర్ ఆ లిస్టులోకి చేరిపోయాడు. తాజాగా లెగ్ స్పిన్నర్ జంపా ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించాడు. వ్యక్తిగత కారణాల వల్ల తాను తప్పుకున్నట్లు జంపా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. 

2023 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన జంపాను రూ. 1.50 కోట్లకు రిటైన్ చేసుకుంది. గత సీజన్ లో 6 మ్యాచ్ లాడిన ఈ ఆసీస్ స్పిన్నర్ 8.54 ఎకానమీ రేటుతో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. అంతకముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున జంపా ఆడాడు. జంపా లేకపోయినా చాహల్, అశ్విన్ స్టార్ స్పిన్నర్లతో రాయల్స్ జట్టు పటిష్టంగానే కనిపిస్తుంది. జంపా స్థానంలో రంజీల్లో సత్తా చాటిన తనిష్ కొటియన్ ను రీప్లేస్ గా రాజస్థా రాయల్స్ ప్రకటించింది. 20 లక్షల బేస్ ప్రెస్ తో ఈ ముంబై ఆల్ రౌండర్ రాజస్థాన్ జట్టులో చేరతాడు.

Also Read :కొన్ని గంటల్లో చెన్నై, బెంగళూరు మ్యాచ్.. తుది జట్టు ఇదే 

రాజస్థాన్ రాయల్స్  జట్టు నుంచి ఇప్పటికే స్పీడ్ స్టార్ ప్రసిద్ కృష్ణ ఐపీఎల్ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. మార్చి 24 న రాజస్థాన్ రాయల్స్ తమ తొలి మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్‌తో తలపడుతుంది.  జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. మొత్తానికి ఇద్దరూ స్టార్ బౌలర్లను కోల్పోయిన రాజస్థాన్ కష్టాల్లో పడిందనే చెప్పాలి.