తెలగాణాలో చలి తీవ్రత భారీగా పెరిగింది. గత కొన్నిరోజులుగా చలికి జనం గజగజ వణుకుతున్నారు. ఇటీవల ఉష్టోగ్రతలు భారీగా పడిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఆర్లి-టి 5.7, బేల 6.3, జైనథ్ 6.3, చప్రాల 6.4, ఆదిలాబాద్ 6.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. కొమురంభీం జిల్లా గిన్నెదరి 6.3, వాంకిడి 6.7, తిర్యాని 7.2, నిర్మల్ జిల్లా పెంబి 6.9, జామ్ 7.7 టెంపరేచర్స్ నమోదు అయ్యాయి. అయితే మరికొన్ని రోజులు రాష్ట్రంలో అత్యల్ప ఉష్టోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రాత్రి పూట చలి తీవ్రత 15 డిగ్రీలు అంతకన్నాతక్కువకు పదడిపోవచ్చని చెబుతోంది.
ఇవి కూడా చదవండి:
