
- ఆయన తాకిన ప్రతి వస్తువును క్లీన్ చేసిన నార్త్ కొరియా సిబ్బంది
బీజింగ్: చైనాలో రష్యా అధ్యక్షుడు పుతిన్, నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ భేటీ తర్వాత ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మీటింగ్ తర్వాత పుతిన్, -కిమ్ వెళ్లిపోగానే.. వారు కూర్చున్న ప్లేస్ లో కిమ్ తాకిన ప్రతి వస్తువును నార్త్ కొరియా స్టాఫ్ క్లీన్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం..పుతిన్, కిమ్ మీటింగ్ ముగించుకుని వెళ్లిపోగానే వారు కూర్చున్న ప్లేస్ కు ఇద్దరు వ్యక్తులు వేగంగా వచ్చారు.
ఒకరు కిమ్ కూర్చున్న కుర్చీని తుడిచేశారు. ఇంకొకరు ఆయన వాటర్ తాగిన గ్లాస్ ను అతి జాగ్రత్తగా ట్రేలో పెట్టుకొని తీసుకెళ్లారు. మీటింగ్ ప్లేస్ లో కిమ్ తాకిన ఫర్నిచర్‌ను, ఇతర వస్తువులను వేగంగా శానిటైజ్ చేసేశారు. ఇదంతా కిమ్ హెల్త్ సీక్రెట్స్ లీక్ కాకుండా, ఆయన డీఎన్ఏ దొరకకుండా నార్త్ కొరియా సిబ్బంది తీసుకున్న చర్యగా తెలుస్తున్నది.
ఇందులో భాగంగా కిమ్ తన డీఎన్ఏ ప్రొటెక్షన్ కోసం చైనాకు ప్రైవేట్ టాయిలెట్‌తో వచ్చారు. కిమ్ సిబ్బంది ఆయన బయోలాజికల్ ట్రేసెస్ విదేశీ ఇంటెలిజెన్స్ చేతికి చిక్కకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నది.