రాష్ట్రంలో మరో 4 ఒమిక్రాన్ కేసులు

రాష్ట్రంలో మరో 4 ఒమిక్రాన్ కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే నాలుగు కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఏడుకు చేరుకుంది. మరో మూడు కేసుల ఫలితాలు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు.   ఎట్  రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఒకరికి.. నాన్ ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన మరో ముగ్గురికి ఒమిక్రాన్ సోకినట్లు గుర్తించారు.

వీరితో కాంటాక్ట్ అయిన వాళ్లందరిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు వైద్యశాఖ అధికారులు. వాళ్ల ప్రైమరీ కాంటాక్ట్స్, ఏ దేశాల నుంచి వచ్చారు.. ఇక్కడ ఏయే ప్రాంతాల్లో తిరిగారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఒమిక్రాన్ వచ్చిన ఇద్దరి పేషెంట్స్ ను టిమ్స్ కు తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు అధికారులు.

FOR MORE NEWS:

6వ అంతస్తు పై నుంచి పడి.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి

ప్రభుత్వం నిజాలు చెప్పడానికి భయపడుతోంది

జాబ్స్ పేరుతో మోసం.. మంత్రి, ఎమ్మెల్యేల హస్తం

ఐటీ అధికారుల పేరుతో మోసం చేసిన ముఠా అరెస్ట్

కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్రమే కట్టుకుంటోంది