నిజాలు చెప్పడానికి ప్రభుత్వం భయపడుతోంది

నిజాలు చెప్పడానికి ప్రభుత్వం భయపడుతోంది

డెహ్రాడూన్:  1971లో పాకిస్తాన్‌పై జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయ్ దివస్ వేడుకలు జరుపుతున్న ప్రభుత్వం ఆ యుద్ధానికి అనుమతిచ్చిన నాటి ప్రధాని ఇందిరాగాంధీని విస్మరించడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన విజయ్ దివస్ వేడుకల్లో ప్రధాని మోడీ ఇందిరాగాంధీ పేరునే ప్రస్తావించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో నిర్వహించిన విజయ్ సమ్మాన్ ర్యాలీ, బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాలు చెప్పడానికి ఈ ప్రభుత్వం భయపడుతోందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమే భారత్ ఆ యుద్ధంలో పాకిస్తాన్ తో తలపడిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 

అమెరికా ఆప్ఘనిస్తాన్ ను ఓడించడానికి 20 ఏళ్లు పట్టింది.. కానీ 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైన యుద్ధంలో ఇండియా 13 రోజుల్లోనే పాకిస్తాన్ ను ఓడించిందని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రజలను బలహీనులుగా మారుస్తోందని రాహుల్ గాంధి అన్నారు. బలహీనుల మధ్య కొట్లాటలు పెట్టి చంపుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో కేవలం ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తల కోసమే ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. 

 

FOR MORE NEWS:

జాబ్స్ పేరుతో మోసం.. మంత్రి, ఎమ్మెల్యేల హస్తం

ఐటీ అధికారుల పేరుతో మోసం చేసిన ముఠా అరెస్ట్

సర్పంచ్ పదవికి వేలం పాట

కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్రమే కట్టుకుంటోంది