Father’s Day: నాలుగేళ్లకే చక్కని చేతి రాత.. కోహ్లీని సర్‌ప్రైజ్ చేసిన కూతురు వామిక

Father’s Day: నాలుగేళ్లకే చక్కని చేతి రాత.. కోహ్లీని సర్‌ప్రైజ్ చేసిన కూతురు వామిక

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఫాదర్స్ డే సందర్భంగా అతని కూతురు వామిక శుభాకాంక్షలు తెలిపింది. నాలుగేళ్ళ వామిక కోహ్లీకి చేతి రాత ద్వారా తన ప్రేమను తెలియజేస్తూ సర్ ప్రైజ్ చేసింది. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఫాదర్స్ డే సందర్భంగా వామిక రాసిన లెటర్ ను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి తన ఆనందాన్ని షేర్ చేసుకుంది. వామిక అందమైన చేతితో రాసిన నోట్‌తో పాటు అనుష్క కింద ఒక  హృదయపూర్వకమైన శీర్షికను రాసింది. " నేను ప్రేమించిన మొదటి వ్యక్తి.. మా కూతురు ప్రేమించిన మొదటి వ్యక్తి. ప్రతిచోటా ఉన్న గొప్ప  తండ్రులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు." అని అనుష్క రాసుకొచ్చింది. 

ALSO READ | Fathers Day: నాన్నకు ప్రేమతో.. లవ్ యూ నాన్న అని ఎందుకు చెప్పకూడదు..?

ఫాదర్స్ డే శుభాకాంక్షలు విషెస్ చెబుతూ వామిక రాసిన లెటర్ సోషల్ మీడియాలో నెటిజన్స్ ను తెగ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నాలుగేళ్ల వయసులో వామిక హ్యాండ్ రైటింగ్ కు అందరూ ఫిదా అయిపోతున్నారు. ఈ లెటర్ లో వామిక ఇలా రాసుకొచ్చింది. "అతను నా సోదరుడిలా కనిపిస్తున్నాడు. అతను ఫన్నీగా ఉంటాడు. అతను నాకు చక్కిలిగింతలు పెడతాడు. నేను అతనితో మేకప్ ఆడుకుంటాను. నేను అతన్ని చాలా ప్రేమిస్తున్నాను. అతను నన్ను చాల ప్రేమిస్తున్నాడు. "హ్యాపీ ఫాదర్స్ డే". అని సంతోషంతో నోట్ ముగించి వామిక తన సంతకం చేసింది.

వామిక రాసిన ఈ లెటర్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. అభిమానులు నాలుగేళ్ల వయసులో రాసిన ఈ లెటర్ చూసి మురిసిపోతున్నారు. చాలా ముద్దుగా రాసింది. అని ఒకరు కామెంట్ చేస్తుంటే.. మరొక యూజర్ "వామిక చేతివ్రాత నా కంటే చాలా అందంగా ఉంది!" అని చమత్కరించాడు. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ దంపతులకు తొలి సంతానంగా 2021, జనవరి 11న వామిక జన్మించింది. అనంతరం 2024 ఫిబ్రవరి 15న ఈ జంటకు మగబిడ్డ పుట్టగా, అతనికి అకాయ్​ అని పేరు పెట్టారు.