నారా వారి ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది. టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్, ఆయన భార్య శిరీషల జీవితంలోకి సరికొత్త అతిథి అడుగుపెట్టాడు. శిరీష తాజాగా ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ గుడ్ న్యూస్ తెలియడంతో నారా కుటుంబ సభ్యులతో పాటు అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి.
మళ్లీ తాతైన సీఎం చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి కుమారుడే నారా రోహిత్ అన్న సంగతి తెలిసిందే. ఈ లెక్కన నారా చంద్రబాబు నాయుడు మరోసారి తాతగా ప్రమోషన్ పొందారు. నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ తర్వాత, నారా వంశంలోకి మరో వారసుడు అడుగుపెట్టడంతో నారావారి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది..
తల్లిదండ్రులుగా ప్రమోట్ ..
నారా రోహిత్, శిరీషల కెమిస్ట్రీ 'ప్రతినిధి 2' సినిమా సెట్స్‌పై మొదలైంది. రీల్ లైఫ్ పార్ట్‌నర్స్ కాస్తా రియల్ లైఫ్ పార్ట్‌నర్స్ మారారు. 2024 అక్టోబర్‌లో వీరి నిశ్చితార్థం జరగ్గా.. 2025 అక్టోబర్ 30న హైదరాబాద్‌లో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతుల సమక్షంలో అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. పెళ్లయిన కొద్ది నెలలకే ఈ క్యూట్ కపుల్ తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు.
►ALSO READ | నటుడు ప్రకాష్ రాజ్‌కు నాన్-బైలబుల్ వారెంట్.. నాలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కుపై కోర్టు సీరియస్!
కెరీర్‌లోనూ ఫుల్ జోష్
ఒకవైపు పర్సనల్ లైఫ్‌లో తండ్రిగా కొత్త అధ్యాయం ప్రారంభించిన రోహిత్, అటు ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ దుమ్మురేపుతున్నారు. ఇటీవల 'సుందరకాండ' సినిమాతో అలరించిన ఆయన, ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఆదర్శ కుటుంబం' లో ఒక పవర్‌ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా రాబోతోంది. జూనియర్ నారా రోహిత్ ఎంట్రీతో నారా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో 'వెల్కమ్ లిటిల్ ప్రిన్స్' అంటూ ట్రెండ్ చేస్తున్నారు..
