ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలసిన జగన్

ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలసిన జగన్

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఇవాళ ఉదయమే కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, నిర్మాణం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే తీర ప్రాంతం వెంబడి నాలుగు లైన్ల రహదారిని నిర్మించాలని జగన్ కోరినట్లు సమాచారం. విశాఖ -భోగాపురం జాతీయ రహదారి నిర్మాణంతోపాటు విజయవాడ తూర్పు హైవే పై కూడా కేంద్ర మంత్రి గడ్కరీతో చర్చించినట్లు తెలుస్తోంది.
నిన్న తొలి రోజు పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, జ్యోతిరాదిత్య సింధియాలను కలిసిన విషయం తెలిసిందే. ఇవాళ కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీని కలసిన అనంతరం కేంద్ర సమాచార ప్రసారాలు, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ను కలిశారు. చర్చల వివరాలు బయటకు రావాల్సి ఉంది. అలాగే హోం మంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

 

ఇవి కూడా చదవండి


ఏపీ మంత్రి నానికి రాంగోపాల్ వర్మ ప్రశ్నల వర్షం

శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో 12మందికి కరోనా

ర్యాగింగ్ చేసిన మెడికోల సస్పెన్షన్
ఒత్తిడి నుంచి బయటపడడానికి ఏం చేయాలంటే..