ఏపీ రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ 

ఏపీ రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ 

రైతన్నలకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో పరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తున్నామన్నారు. గతేడాది నవంబర్‌లో భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతన్నల ఖాతాల్లో ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీని జమ చేసింది. దీనివల్ల వర్షాలు, వరదలతోపాటు నేల కోత, ఇసుక మేటల కారణంగా పంటలు నష్టపోయిన 5,97,311 మంది రైతన్నలకు లబ్ధి చేకూరింది. మొత్తం రూ.542.06 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశారు. అలాగే 1,220 రైతు గ్రూపుల ఖాతాల్లో వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లను కూడా జమ చేశారు. ఇలా మొత్తం రూ.571.57 కోట్లను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశారు. 

మరిన్ని వార్తల కోసం

మేడారం జాతరకు యాప్.. అన్ని వివరాలు ఫోన్​లోనే

ఏడు రాష్ట్రాల్లో 14 పెళ్లిళ్లు చేసుకున్న నకిలీ డాక్టర్