సినిమా టికెట్ల అమ్మకానికి ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ పోర్టల్ 

సినిమా టికెట్ల అమ్మకానికి ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ పోర్టల్ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకులు సినిమా టికెట్లను బుక్ చేసుకునేందుకు ఆన్ లైన్ వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. త్వరలోనే ఆన్ లైన్ పోర్టల్ ను ప్రారంభించబోతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేయనుంది.

రైల్వే ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ తరహాలో పోర్టల్ ను అభివృద్ది చేయబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వ్యవహారాలను రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుందని తెలిపింది.