ఇక నుంచి ఐ ఫోన్ తయారీ చైనాలో కాదు చెన్నై దగ్గర్లో..

ఇక నుంచి ఐ ఫోన్ తయారీ చైనాలో కాదు చెన్నై దగ్గర్లో..

కొత్తగా ఆరు వేల ఉద్యోగాలు

న్యూఢిల్లీ: ఆపిల్ ఐ ఫోన్లను తయారు చేసే ఫాక్స్‌కాన్ కంపెనీ తమిళనాడులోని తన ప్లాంట్‌లో ఒక బిలియన్ డాలర్ల (రూ.7,515 కోట్ల) పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్టు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. ప్లాంట్ విస్తరణలో భాగంగా ఈ పెట్టుబడులు పెడుతున్నట్టు పేర్కొంది. వచ్చే మూడేళ్లలో ఈ పెట్టుబడులను ఫాక్స్‌కాన్ పెడుతోంది. చైనా నుంచి ఐఫోన్ ప్రొడక్షన్‌‌ను తరలించాలని ఫాక్స్‌కాన్ భావిస్తోంది. ఈ క్రమంలో భాగంగా తమిళనాడు ప్లాంట్‌ విస్తరణలో ఫాక్స్‌కాన్ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్టు రాయిటర్స్ పేర్కొంది. చైనా దేశంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఇప్పటికే చాలా కంపెనీలు నిర్ణయిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్‌‌ఐ) స్కీమ్‌ టైమ్‌ఫ్రేమ్‌లోనే ఇది ఉన్నట్టు పేర్కొంది. ఈ స్కీమ్‌ను ప్రయోజనాలు పొందుతోన్న ఐదు ‘ఫారిన్ ఛాంపియన్స్‌’లో ఫాక్స్‌కాన్ ఒకటని ఇప్పటికే పలు రిపోర్టులు చెప్పాయి. ఈ పెట్టుబడులతో ఫాక్స్‌కాన్ తమిళనాడు ప్లాంట్‌లో మరో 6 వేల ఉద్యోగాలను యాడ్ చేయనుంది. తమిళనాడులోని శ్రీపెరుంబూర్‌‌‌‌లో ఈ ప్లాంట్‌ ఉంది. ఈ ప్లాంట్‌ నుంచి కంపెనీ ఐఫోన్ ఎక్స్‌ఆర్‌‌ ‌‌ఫోన్లను తయారు చేస్తోంది. ఆపిల్ చౌకైన ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ ఇది. పాత వెర్షన్ ఐఫోన్ ఎస్‌ఈ, ఇతర వాటిని కూడా ఇక్కడే తయారు చేసేది. ఈ ఇన్వెస్ట్‌‌మెంట్ గురించి ఫాక్స్‌కాన్ ఛైర్మన్ లియు యంగ్ వే గత నెలలో జరిగిన మీటింగ్‌లోనే చెప్పినట్టు తెలిసింది. ఇండియాలో ఫాక్స్‌కాన్ కంపెనీ మరింత పుంజుకోవాలనుకుంటోంది. ఫాక్స్‌కాన్ చైనీస్ షియోమి ఫోన్లను కూడా తయారు చేస్తోంది. షియోమి ప్రస్తుతం ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో లీడ్‌‌లో ఉంది. ఈ డివైజ్‌లను ఏపీ ప్లాంట్‌లో మాన్యుఫాక్చర్ చేస్తోంది. అయితే ప్రస్తుతం ఇన్వెస్ట్‌‌మెంట్ మాత్రం ఐఫోన్ ప్లాంట్‌లోకే వస్తున్నట్టు రాయిటర్స్ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎల్‌‌ఐ స్కీమ్, దేశంలో మాన్యుఫాక్చరింగ్‌ను పెంచడంతో పాటు, దేశంలోకి మరిన్ని కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్‌ను తీసుకురానుంది.

For More News..

టీటీడీలో 98 మందికి కరోనా

కరోనా వస్తే ప్రజాప్రతినిధులు కూడా గాంధీలోనే చేరాలి

ట్రెయినింగ్‌ కోసం కారు అమ్మకానికి పెట్టిన ప్లేయర్

ఊపందుకున్న సైకిల్ సవారీ