పురుషుల రికార్డులు కొల్లగొట్టిన మహిళలు.. అంతర్జాతీయ క్రికెట్‌లో పెను సంచలనం

పురుషుల రికార్డులు కొల్లగొట్టిన మహిళలు.. అంతర్జాతీయ క్రికెట్‌లో పెను సంచలనం

క్రికెట్ అంటే.. అబ్బాయిలదే. అమ్మాయిల మ్యాచ్‌లు అంత మజా అనిపించవు అనుకునే సమాజం మనది. ఈ రోజుల్లోనూ ఆ అసమానత్వం ఉందంటే నమ్మండి. కాదంటే పురుషు క్రికెటర్లు సైతం ఆశ్చర్యపోయేలా..! ప్రపంచ రికార్డులు బద్దలయ్యేలా! ఓ పసికూన జట్టు ఆడిన సంచలన ఇన్నింగ్స్.. రెండ్రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిందంటే ఆలోచించండి. 

టీ20 క్రికెట్‌లో అర్జెంటీనా, చిలీ మహిళల జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కలలో కూడా ఊహించని రికార్డులు నమోదయ్యాయి. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా మహిళల జట్టు ఏకంగా 427 పరుగులు చేసింది. టీ20 క్రికెట్‌లో ఇదే అత్యధిక స్కోర్‌. గతంలో ఈ రికార్డు బెహ్రయిన్‌ మహిళల జట్టు(318, సౌదీ అరేబియాపై) పేరిట ఉండేది. తాజాగా ఆ రికార్డును ఇప్పుడిప్పుడే క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకుంటున్న పసికూన అర్జెంటీనా బద్దలుకొట్టింది. అంతేకాదు.. అంతర్జాతీయ పురుషులు మ్యాచ్‌ల్లోనూ ఇదే అత్యధిక స్కోర్. కొద్దిరోజుల క్రితం జరిగిన ఏషియన్‌ క్రికెట్ క్రీడల్లో నేపాల్‌ జట్టు చేసిన 314 పరుగులే ఇప్పటివరకూ అత్యధికం.

ఇ‍ద్దరే ఆడేశారు.. 

చిలీతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా మహిళా క్రికెటర్లు లూసియా టేలర్‌ (169; 84 బంతుల్లో 27 ఫోర్లు), అల్బెర్టీనా గలాన్‌ (145 నాటౌట్; 84 బంతుల్లో 23 ఫోర్లు) సెంచరీలు బాదారు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. అయితే, టీ20ల్లో మాత్రం ఈ ఫీట్‌ ఐదుసార్లు నమోదైంది. వీరిద్దరూ ఇన్ని పరుగులు చేసినా.. ఇన్నింగ్స్ మొత్తంలో ఒక్క సిక్స్ కూడా ఈ మ్యాచ్ మరోప్రత్యేకత.

అనంతరం 427 పరుగుల లక్ష్య ఛేదనలో చిలీ బ్యాటర్లు 63 పరుగులకే చేతులెత్తేశారు. చిలీ ఇన్నింగ్స్‌లో ఐదుగురు డకౌట్ కాగా.. నలుగురు రనౌట్, ఇద్దరు సున్నాకే పరిమితమయ్యారు. ఈ  మ్యాచ్ లో అర్జెంటీనా జట్టు 364 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.