‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఉక్రెయిన్​లో యుద్ధం ఆపడమెలాగంటే..!: వివేక్ రామస్వామి

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఉక్రెయిన్​లో యుద్ధం ఆపడమెలాగంటే..!:   వివేక్ రామస్వామి

వాషింగ్టన్: ఉక్రెయిన్ – రష్యా యుద్ధం ఆగాలంటే.. చైనాతో పుతిన్ దోస్తీని కట్ చేయాలని అమెరికా అధ్యక్ష అభ్యర్థి వివేక్ రామస్వామి అన్నారు. ఇదే తన ప్లాన్ అని చెప్పారు. ఈ పని తాను చేయగలనని, తన విదేశీ విధానాల్లో ఇదే మొదటిదని వివరించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక మాస్కోలో పర్యటిస్తానని చెప్పారు. చైనాతో దోస్తీని వదులుకునేలా పుతిన్​ను ఒప్పిస్తానని తెలిపారు. 

రష్యా – చైనా సైనిక కూటమితో అమెరికాకు ముప్పు పొంచి ఉందన్నారు. అయితే, ఈ మొత్తం ప్రాసెస్‌‌‌‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌‌‌‌ను ఓడించే లక్ష్యంతో కాకుండా అమెరికాను గెలిపించే లక్ష్యంతో ముందుకెళ్తానని వివేక్ రామస్వామి స్పష్టంచేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నిక‌‌‌‌ల్లో ఇండియాకు చెందిన వివేక్ రామ‌‌‌‌స్వామి రిప‌‌‌‌బ్లిక‌‌‌‌న్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆస‌‌‌‌క్తిగా ఉన్నారు. ఆ పార్టీ అభ్యర్థిత్వం కోసం క్యాంపెయిన్ కూడా ప్రారంభించారు. ఈ క్రమంలో మీడియా ఇంటర్వ్యూలు, చర్చా వేదికలపై వివిధ అంశాల గురించి తన ఆలోచనలను పంచుకుంటున్నారు.

బైడెన్ ప్లాన్ సరిగ్గా లేదు

రష్యా యుద్ధం ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ అనుసరిస్తున్న విధానం సరిగ్గా లేదని వివేక్ రామస్వామి అన్నారు. ఉక్రెయిన్ కు మద్దతుగా అమెరికా ఎంత సాయం చేసినా ప్రయోజనం లేదన్నారు. దీంతో పుతిన్ చైనాకు మరింత దగ్గరవుతారని ఆరోపించారు. చైనా, రష్యా సైనిక కూటమితో అమెరికాకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

డాన్ బాస్ ప్రాంతంలోని కొన్ని భాగాలను రష్యా ఆధీనంలో ఉంచి.. ఉక్రెయిన్‌‌‌‌ను నాటోలో చేరకుండా చూస్తే ఈ యుద్ధం ఆగిపోతుందని అభిప్రాయపడ్డారు. అమెరికా, చైనా కంటే.. హైపర్ సోనిక్‌‌‌‌, న్యూక్లియర్​ కెపాసిటీలో రష్యా ఎంతో ముందుందన్నారు. నావికా దళం సామర్థ్యంలోనూ యూఎస్​ కంటే చైనా ముందు వరుసలో ఉందని తెలిపారు.