అనిల్ రావిపూడితో బాలయ్య సినిమా..?

అనిల్ రావిపూడితో బాలయ్య సినిమా..?

అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ -3 ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి బాలయ్యతో ఓ సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతం బాలకృష్ణ గోపించంద్ మాలినేని డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు అన్నగారు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమా తర్వాత బాలయ్య.. అనిల్ రావిపూడితో సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తుంది. అనిల్ డైరెక్షన్ లో రాబోయే సినిమాకు నటసింహం అనే పేరు పరిశీలనలో ఉందట. ఈ సినిమా ఓపెనింగ్ కు ముహుర్తం కూడా ఫిక్స్ చేసినట్లు ఫిలింనగర్ టాక్. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట యూనిట్.

అనిల్ రావిపూడి బాలయ్యతో సినిమా చేయాలని ఇంతకు ముందు ప్రయత్నించగా..  ఇప్పటికీ ఈ కాంబినేషన్ ఫిక్సయినట్లు సమాచారం. అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 తో ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ రిలీజ్ తర్వాత..బాలయ్య స్క్రిప్ట్ ను తీర్చిదిద్దుతాడట. తర్వాత ప్రీప్రొడక్షన్ పనులు మొదలు పెట్టి..సెప్టెంబర్ లో సినిమా ప్రారంభించబోతున్నారట.  ఈ మూవీ..యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందట. బాలయ్య ఫ్యాన్స్ కోరుకునే అంశాలతో పాటు..అనిల్ రావిపూడి టైప్ ఆఫ్  కామెడీతో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చుస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఎఫ్3లో మినిమమ్ ఇట్లా ఉండాలా అంటున్న పూజా

ఖమ్మంలో మంత్రి పువ్వాడ దిష్టి బొమ్మ దహనం

మీర్ పేట కార్పొరేషన్ లో బ్లడ్ బ్యాంక్ భవనం ప్రారంభం