టీఆర్ఎస్ గూండాల కనుసన్నల్లోనే దాడి

టీఆర్ఎస్ గూండాల కనుసన్నల్లోనే దాడి

ఎంపీ ధర్మపురి అరవింద్ పై దాడి పోలీసులు, టీఆర్ఎస్ గుండాల కనుసన్నళ్లోనే జరిగిందన్నారు తెలంగాణ బీజపీ చీఫ్ బండి సంజయ్. డీజీపీ మహేందర్ రెడ్డి ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయడని విమర్శించారు. ఆయనకు ఎందుకు ప్రభుత్వం ఫోన్ ఇచ్చిందో అర్ధం కావడం లేదన్నారు. పార్లమెంట్ సభ్యుడి పై దాడి జరిగింది అంటే .. రాష్ట్రలో పరిస్థితి అర్థంచేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ... ఎంపీ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉన్నత చదువులు చదివిన ఉద్యోగాలు లేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో యువకుడి ఆత్మహత్య బాధాకరమన్నారు. 
ఇంకా ఎంతమందిని బలితీసుకుంటారో ముఖ్యమంత్రి అంటూ బండి సంజయ్ విమర్శించారు. 

317 జీవో తో ఉద్యోగుల్లో ఆందోళనలు నెలకొని ... బాధతో చనిపోతున్నారన్నారు. ఫామ్ హౌస్ నుండి సీఎం కేసీఆర్  7 సంవత్సరాలుగా బయటకు రావడం లేదన్నారు. వెంటనే 317 జీవో ని సవరించకపోతే త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామన్నారు. కేంద్రం దృష్టికి తీసుకుపోతామన్నారు. తెలంగాణ రాష్టంలో సీఎం జిల్లాకు ఒక రూల్ తెస్తున్నారని విమర్శించారు. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో సీఎంకి దిక్కుతోచడంలేదన్నారు. మొదటి తెలంగాణ ద్రోహి కెసిఆర్ అంటూ ధ్వజమెత్తారు. కనీసం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఓటింగ్ లో కూడా పాల్గొనలేదన్నారు. ముఖ్యమంత్రి స్కాంలపై కేంద్రం దృష్టి పెట్టిందన్నారు. కేసీఆర్ కు జైలు జీవితం తప్పదన్నారు. 

కొత్త డ్రామాతో కేసీఆర్ ముందుకు పోతున్నాడని బండి సంజయ్ ఆరోపించారు. కేంద్ర నిధుల్ని కేసీఆర్ దారి మళ్లించారన్నారు. దమ్ముంటే ఆ లిస్ట్ బయటకు తీయాలన్నారు. పీఎం ని ఎన్నోసార్లు కలిసిన ముఖ్యమంత్రి కి తెలంగాణకి అన్యాయం జరిగింది అని ఎందుకు గుర్తు చేయలేదన్నారు. లేఖల పేరుతో కేంద్రం పై బురదజాల్లడం తప్ప మరేమి లేదన్నారు. ఉప ఎన్నికలు జరిగిన నాగార్జున సాగర్, హుజూర్ నగర్ ల్లో ఇచ్చిన హామీలు ఇప్పటికి అమలుకాలేదని ఆరోపించారు బండి సంజయ్. 

ఇవి కూడా చదవండి:

ఐదేళ్ల తర్వాత  రాజకీయాల్లోకి వచ్చే అవకాశం

వచ్చే ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి పోటీ చేస్తా