సీఎం కేసీఆర్కు బండి సంజయ్ బహిరంగ లేఖ

సీఎం కేసీఆర్కు బండి సంజయ్ బహిరంగ లేఖ

బీజేపీ పోరాటాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రధానికి సీఎం కేసీఆర్ రాసిన లేఖ పచ్చి అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేంద్రంపై ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసిన బండి సంజయ్.. సీఎం కేసీఆర్ అవినీతి బండారాన్ని బయటపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతుండటంతో జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఎన్ని డ్రామాలకు తెరతీసినా.. బీజేపీ ఆయన ట్రాప్ లో పడదని అన్నారు. 317 జీవోను సవరించేదాకా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆనందంతో సంక్రాంతి చేసుకోవాల్సిన రైతులు, ఉద్యోగులు.. ప్రభుత్వ తీరు వల్ల కన్నీళ్లతో సకినాల పిండి తడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని బండి సంజయ్ విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి సరుకుల కొరత కారణంగా ఎరువులు, పురుగు మందుల ధరలు పెరిగాయని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 23 రకాల పంట ఉత్పత్తుల కనీస మద్దతు ధర 50 నుంచి 100శాతానికిపైగా పెంచిందని చెప్పారు.

For more news..

కేసీఆర్.. ఎందుకీ రాజకీయ డ్రామాలు?

ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై అధికారుల దాడులు