అక్టోబర్ 18న రాష్ట్ర బంద్‌‌‌‌‌‌‌‌ను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలే : పర్శ హన్మండ్లు

అక్టోబర్ 18న రాష్ట్ర బంద్‌‌‌‌‌‌‌‌ను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలే  : పర్శ హన్మండ్లు

రాజన్నసిరిసిల్ల, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు ఈ నెల18న చేపట్టనున్న రాష్ట్ర బంద్‌‌‌‌‌‌‌‌ను సక్సెస్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి  పర్శ హన్మండ్లు కోరారు. గురువారం సిరిసిల్ల జిల్లాకేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బంద్‌‌‌‌‌‌‌‌కు అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆర్టీసీ బస్సులు, ఇతర వ్యాపార సంస్థలు మూసివేసి సహకరించాలని కోరారు. సమావేశంలో  బీసీ జేఏసీ ప్రతినిధులు కత్తెర దేవదాస్, బొప్ప దేవయ్య, రామ్, భిక్షపతి, మల్లేశం, అంజయ్య, కమలాకర్, కందుకూరి రామాగౌడ్, బాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, బోయిన శ్రీనివాస్, రాజు, కైలాసం, తదితరులు పాల్గొన్నారు.

మంథని, వెలుగు: మంథనిలో విద్యార్థి యువత ఆఫీసులో గురువారం  బీసీ జేఏసీ, వివిధ రాజకీయ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో బంద్ నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు లీడర్లు మాట్లాడుతూ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో బిల్లు పెట్టి ఆమోదింప జేసి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను వెంటనే కల్పించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ నెల 18న జరిగే రాష్ట్రవ్యాప్త బంద్ సందర్భంగా మంథని నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో బీసీ లీడర్లు డిగంబర్,  పెండ్యాల రామ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గుండ్ల సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

సుల్తానాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లను 42 శాతం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సుల్తానాబాద్ లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈనెల 18న నిర్వహించ తలపెట్టిన బంద్ ను విజయవంతం చేయాలని తీర్మానించారు. నాయకులు గుర్రాల మల్లేశం, సాయిరి మహేందర్, శ్రీమాన్, శ్రీనివాస్ గౌడ్, అంజయ్య గౌడ్, అబ్బయ్య గౌడ్, నాగరాజు, గోపాల్ యాదవ్, ప్రవీణ్, భూమేశ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు