
కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ అంసతృప్తి వ్యక్తం చేసింది. ప్రజల కోసం కాకుండా కార్పొరేట్ శక్తుల్ని కాపాడేలా బడ్జెట్ ఉందని అభిప్రాయపడింది. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు ఇచ్చిందేమీలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీకి వెళ్లి పైరవీలు చేసుకుంటున్నారని ఆరోపించారు. బడ్జెట్లో ఆరోగ్యం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కల్పన గురించి కేంద్రం ప్రస్తావించలేదని అన్నారు. సీఎం కేసీఆర్, మోడీ కలిసి నాటకం ఆడుతున్నారని, అందులో భాగంగానే ఆయన బీజేపీని తిట్టినట్లుగా నటిస్తున్నారని మండిపడ్డారు. ఫ్యూడల్, మత శక్తులపై పోరాటానికి ప్రజలంతా ఏకం కావాలని భట్టి పిలుపునిచ్చారు.
మరిన్ని వార్తల కోసం..