రష్యాకు సహకరించొద్దని చైనాకు బైడెన్ హెచ్చరికలు

 రష్యాకు సహకరించొద్దని చైనాకు బైడెన్ హెచ్చరికలు

జీ 20 నుంచి రష్యాను తప్పించాలన్నారు బైడెన్. చైనాకు హెచ్చరికలను జారీ చేశారు అమెరికా అధ్యక్షుడు. రష్యాకు మద్దతు పలికితే- కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. రష్యాతో సమానంగా ఆర్థిక పరమైన ఆంక్షలు, నిషేధాజ్ఞలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. దీనిపై కిందటి వారమే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ఫోన్ లో మాట్లాడానన్నారు బైడెన్. రష్యాకు సహకరించవద్దని జిన్ పింగ్ ని కోరానన్నారు.

నాటో సభ్యులతో వర్చువల్ గా మాట్లాడారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. రష్యా ఫాస్ఫరస్  బాంబులను వాడుతోందని ఆరోపించారు జెలెన్ స్కీ. నాటో, ఐరోపా సమాఖ్య దేశాలు తమ వద్ద ఉన్న యుద్ధ విమానాల్లో కొన్నైనా తమకు అందజేస్తే.... రష్యాపై పైచేయి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.  రష్యా నుంచి స్వాధీనం చేసుకుంటున్న ట్యాంకులను ఉక్రెయిన్  దాచుకుంటుందని చెబుతున్నారు ఓపెన్ -సోర్స్  ఇంటెలిజెన్స్  అనలిస్టులు. కాగా, ఈ నెల రోజుల్లో ఉక్రెయిన్ లోని సగం మంది చిన్నారులు దాదాపు 43 లక్షల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందన్నారు అధికారులు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ జనాభాలో నాలుగో వంతు.. దాదాపు కోటి మంది పౌరులు వలస వెళ్లారని, వీరిలో 38 లక్షల మంది శరణార్థులుగా వివిధ దేశాల్లో ఉన్నారని తెలిపింది ఐక్యరాజ్య సమితి.

మరిన్ని వార్తల కోసం

పీయూష్ గోయల్‎కు ఎర్రబెల్లి సవాల్

ఏప్రిల్ 14 నుంచి ‘ప్రజా సంగ్రామ యాత్ర’ 2