సీనియర్ హీరోస్ కరువు తీర్చబోతున్న.. ఆ హీరోయిన్స్‌!

సీనియర్ హీరోస్ కరువు తీర్చబోతున్న.. ఆ హీరోయిన్స్‌!

ప్రస్తుతం టాలీవుడ్లో సీనియర్ హీరోస్ తమ వయస్సుకు తగ్గ సినిమాలు కాకుండా..డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోను వస్తున్నారు. కొంతమంది బడా స్టార్స్ యంగ్ హీరోస్కు పోటీ అంటూ..లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా తోను, మాస్ యాక్షన్స్ మూవీస్ తోను వస్తున్నారు. చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna), వెంకటేష్(Venkatesh), నాగార్జున(Nagarjuna) వంటి బడా హీరోస్ సినిమాలంటే..హీరోయిన్స్ ఎవరో తెలుసుకోవాలని..ఆడియన్స్లో క్యూరియాసిటీ ఉంటుంది.  

మరి వీరి వయస్సుకు తగ్గ హీరోయిన్స్ మొన్నటి వరకు ఎవ్వరు లేరు. కానీ, లేరనుకున్న స్టార్ హీరోయిన్స్.. మళ్ళీ సక్సెస్ ఫార్ములతో తెరపైకి వస్తున్నారు. ఇక మన స్టార్ హీరోస్కి.. హీరోయిన్స్ దొరికేసారన్న మాట. మరెవరో లుక్కేద్దాం. 

సీనియర్ హీరోయిన్స్ అంటే..మనకు ఇప్పుడు టక్కున గుర్తొచ్చే పేర్లు..అనుష్క(Anushka shetty), కాజల్(Kajal), త్రిష(Trisha), నయనతార(Nayanathara), తమన్నా(Thamannah). గత ఏడాది వరకు ఈ లిస్ట్లో యాక్టీవ్ గా ఉన్నది ఎవరంటే, నయనతార,తమన్నా అని చెప్పుకోవాలి. కానీ, అనుష్క, కాజల్ మాకేం తక్కువంటూ కరెంట్ హిట్ స్టేటస్ లోకి వచ్చారు. 

అనుష్క ప్రస్తుతం చిరంజీవి 157వ సినిమాలో సెలెక్ట్ అయినట్లు సమాచారం. బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రెస్టీజియస్ సినిమాను..యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సోషియో ఫాంటసీ కథాంశంతో రానున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుండే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో అనుష్క ఈ సినిమాకు దొరికిన మరో స్టార్ హీరోయిన్ గా స్టేటస్ తెచ్చుకోవడం కన్ఫర్మ్ అనే టాక్ ఉంది. ఇక బడా హీరోస్ తగ్గ హీరోయిన్ అనుష్క అని చెప్పుకోవడంలో సందేహం లేదు. 

టాలీవుడ్ లో కంటిన్యూగా సినిమాలు చేసిన కాజల్..రెండేళ్లుగా తెలుగు తెరపై చాలా తక్కువగా కనిపిస్తోంది. మ్యారేజ్ అవ్వడం..కొడుకు పుట్టడంతో కొన్నాళ్ళు సినిమాలకి బ్రేక్ ఇవ్వగా..కాజల్ పేరే వినబడకండా పోయింది. ఇక రీసెంట్గా క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి..బాలయ్య కాంబోలో వస్తోన్న మూవీ భగవంత్ కేసరి. బాలయ్యకు జోడిగా కనిపిస్తుండగా.ఈ సినిమా హిట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో మళ్ళీ వరుస అవకాశాలు రావడం కన్ఫమ్ అని చెప్పొచ్చు.

మిల్కీబ్యూటీ తమన్నా..కొన్నాళ్ళు అటు యంగ్ హీరోస్ తోను, సీనియర్ హీరోస్ తోను నటిస్తూ బిజీగా మారింది. కానీ, మధ్యలో సరైన హిట్స్ రాకపోవడంతో గ్లామర్ కే పరిమితమైంది. ఇక రీసెంట్ గా వచ్చిన లస్ట్ స్టోరీస్, జైలర్ కావాలయ్యా సాంగ్ తో మళ్ళీ ఇండస్ట్రీలో పేరు వినిపిస్తోంది. ఇప్పుడు తమన్నా యాక్టీవ్ మోడ్ లోకి  వచ్చినట్లు తెలుస్తోంది. 

నయనతార..జవాన్ సక్సెస్ తో మంచి క్రేజ్ లో ఉంది. తెలుగు,తమిళ్, మలయాళం, బాలీవుడ్ లోను మంచి పాత్రలతో ఇండస్ట్రీలో రాణిస్తుంది. సీనియర్ హీరోస్ కి పర్ఫెక్ట్ జోడీగా నయనతార ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది.

త్రిష పొన్నియన్ సెల్వం మూవీతో మంచి హిట్ కొట్టింది. దీంతో వరుస లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ.. బడా హీరోస్ తో సినిమా చేయడానికి రెడీ అంటోంది. ప్రస్తుతం త్రిష..దళపతి విజయ్ లియో మూవీలో నటిస్తుంది.

మన టాలీవుడ్ సీనియర్‌ హీరోలకు..హీరోయిన్స్ కరువు తీరి పోయిందనే చెప్పుకోవాలి. నయనతార, అనుష్క, కాజల్‌ అగర్వాల్‌, త్రిష, తమన్నా లు మంచి ఫామ్‌ లోకి రాగా..డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కి కూడా తలనొప్పి తగ్గినట్లే తెలుస్తోంది.