మహారాష్ట్రలో బీఆర్ఎస్‌‌కు బిగ్ షాక్

మహారాష్ట్రలో బీఆర్ఎస్‌‌కు బిగ్ షాక్
  •     పార్టీకి జనరల్ సెక్రటరీ మాణిక్ రావ్ కదం రాజీనామా
  •     ఎన్‌‌సీపీ అజిత్ వర్గంలో చేరిక

హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్రలో పాగా వేయాలనుకున్న  బీఆర్ఎస్‌‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. మాణిక్ రావ్ కదం.. మహారాష్ట్ర బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీతోపాటు భారత రాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్ష బాధ్యతలకు కూడా రాజీనామా చేసి.. అజిత్ పవార్ సమక్షంలో ఎన్‌‌సీపీలో చేరారు. రైతు నాయకుడిగా మాణిక్ రావ్‌‌ మహారాష్ట్రలో గుర్తింపు పొందారు. అందుకే పార్టీలో చేరగానే ఆయన్ను ఎన్‌‌సీపీ రైతు సంఘం అధ్యక్షుడిగా అజిత్ పవార్ నియమించారు. మరికొంత మంది మహారాష్ట్ర కీలక నేతలు కూడా బీఆర్​ఎస్​ను వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.