మాకు ఓటేస్తే.. బియ్యం,పప్పు, ఉప్పు అన్ని రూపాయికే

మాకు ఓటేస్తే.. బియ్యం,పప్పు, ఉప్పు అన్ని రూపాయికే

తాము అధికారంలోకి వస్తే 5 కిలోల బియ్యం, అరకిలో పప్పు, అర​కిలో ఉప్పును కేవలం ఒక రూపాయికే  అందిస్తామని ఒడిషాకు చెందిన ఓ బీజేపీ నేత హామీ ఇచ్చారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నాడు కట​క్‌ జిల్లాలోని చౌవార్లో బీజేపీ ఎన్నికల ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్… ఒడిషాలో బీజేపీ అధికారంలోకి వస్తే నెలవారీగా ఇంట్లో వాడే కనీస సరుకులను ఒక్క రూపాయికే అందిస్తామని ప్రకటించారు.

నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ పథకం (ఎన్ఎఫ్ఎస్ఎ)  కింద  ఈ పథకం ద్వారా 3.26 కోట్ల  పేద ప్రజలకు లబ్ధి  చేకూర్చనుందని ఆయన చెప్పారు.  ప్రతి కిలో బియ్యంపై కేంద్ర ప్రభుత్వం 29 రూపాయల సబ్సిడీని అందజేస్తోంటే, రాష్ట్రంలో వాటా కేవలం రూ .2 మాత్రమే అని ప్రధాన్ చెప్పారు.