టీఆర్ఎస్ సర్పంచ్ లకే నిధులు ఇచ్చారు

టీఆర్ఎస్ సర్పంచ్ లకే నిధులు ఇచ్చారు

కేంద్రం ప్రభుత్వం జాతీయ నిధుల నుండి nrgs నిధులు మంజూరు చేసిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. దుబ్బాక నియోజకవర్గంలో మాత్రం నిధులు కేవలం టీర్ఎస్ సర్పంచ్ లకు ఇచ్చారన్నారు. రూ. 53 కోట్ల నిధులు వస్తే మాకు కేవలం 3 కోట్ల నిధులు ఇచ్చారన్నారు. రెండు మూడు నెలలు గడుస్తున్నా సిద్దిపేట జిల్లాకు కలెక్టర్ లేడన్నారు.కనీసం జాయింట్ కలెక్టర్ వినతిపత్రం ఇస్తాం అని వస్తే అధికారులు ఎవ్వరు కార్యాలయంలో లేరు,ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయడం లేదన్నారు. కోట్లు రూపాయలు నిధులు పెట్టి కలెక్టరేట్ కార్యాలయం కడితే ఇక్కడ అధికారులు ఎవ్వరు లేరని రఘునందన్ ఆరోపించారు. Nrgs నిధులు మాకు అన్యాయం జరిగింది కావున ,మా నియోజకవర్గానికి ఎన్ని నిధులు రావాలో అవన్నీ మంజూరు చేయాలని రఘునందన్ డిమాండ్ చేశారు. ఉన్నత అధికారులు వచ్చి వినతిపత్రం తీసుకునే దాకా ఇక్కడే నిరసన చేపడుతామన్నారు. ఏ అధికారి ఎలా నివేదిక పంపి నిధుల మంజూరు చేసారో మాకు తెలియాలన్నారు రఘునందన్.

ఇవి కూడా చదవండి:  

రేపటి నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు

భరత్ భూషణ్ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం