
తెలంగాణలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద జనం రద్దీ కొనసాగుతోంది. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనుండటంతో భూములను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. అమ్మకం దారులు, కొనుగోలు దారులతో రిజిస్ట్రేషన్, తహశీల్దార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మూల మార్కెట్ విలువల్ని సవరించి, కొత్త మార్కెట్ విలువలను ప్రభుత్వం మంగళవారం నుంచి అమల్లోకి తీసుకురాబోతుంది.
మరిన్ని వార్తల కోసం
డ్రిల్ మెక్ సంస్థతో తెలంగాణ ఒప్పందం