పండగ తర్వాత 4 రాష్ట్రాల్లో కొలువుదీరనున్న కొత్త సర్కారు 

పండగ తర్వాత 4 రాష్ట్రాల్లో కొలువుదీరనున్న కొత్త సర్కారు 

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. హోలీ (మార్చి 18) తర్వాత ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది. పండగ తర్వాత ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల కొత్త ముఖ్యమంత్రుల ఎంపిక జరగనున్నట్లు సమాచారం. రాష్ట్ర నాయకులతో సమన్వయం చేసుకుంటూ 4 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి పార్టీ అగ్రనేతలు హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, పీయూష్ గోయెల్లు హోలీ తర్వాతి రోజున ఉత్తరాఖండ్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. మార్చి 20న ఉత్తరాఖండ్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్నట్లు సమాచారం.

మణిపూర్, గోవాల్లో ఇప్పటికే అసెంబ్లీలు రద్దు అయ్యాయి. మణిపూర్లో ఎమ్మెల్యేలు ఇవాళ ప్రమాణం చేశారు. మంగళవారం గోవాలో ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్నారు. యూపీ సీఎంగా మళ్లీ యోగికే అవకాశం ఇస్తారన్న వార్తలు వస్తున్నeయి. గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్లో మాత్రం ఎవరు సీఎం అవుతారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది.

మరిన్ని వార్తల కోసం..

కాంగ్రెస్ ఓటమికి వారే బాధ్యత వహించాలి

ఏపీ మంత్రి మేకపాటి శాఖలపై జగన్ కీలక నిర్ణయం