రైస్ మిల్లర్లకు ధాన్యంపై క్లారిటీ లేదు

రైస్ మిల్లర్లకు ధాన్యంపై క్లారిటీ లేదు

జగిత్యాల జిల్లా: హిందూసమాజం కోసం పనిచేసేవారిని, బీజేపీని టార్గెట్ చేసి సీఎం కేసీఆర్ టార్చర్ పెడుతున్నారని మండిపడ్డారు బీజేపీ ఎంపీ ధర్వపురి అర్వింద్. దౌర్జన్యం, దాడులు పోయి మర్డర్లు కూడా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం, రామాయంపేట ఘటనలే ఇందుకు ఉదాహరణ అన్నారు అర్వింద్. జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఆయన.. ఎడ్లంగడి రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రైస్ మిల్లర్లకు ధాన్యం కొనుగోలుపై క్లారిటీ లేదన్నారు. ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేని వ్యక్తి ధాన్యం కొంటాడా? అని ఆయన ప్రశ్నించారు. సిగ్గు, మానం ఉంటే 6 నెలల ముందు బయిల్డ్ ఇవ్వమని ఎందుకు రాసి ఇచ్చిండు అని నిలదీశారు. స్థానిక వ్యాపారి పరారీ కేసులో టీఆర్ఎస్ నాయకుల ప్రమేయం ఉందన్నారు. ఈ విషయంపై డీజీపీతో మాట్లాడతానన్నారు అర్వింద్.

 

 

ఇవి కూడా చదవండి

కర్ణాటకలో జేపీ నడ్డా పర్యటన

సారవంతమైన సాగుభూములను లాక్కుంటే అడ్డుకుంటాం

ప్రజలేం తినాలో ప్రభుత్వం నిర్ణయించదు

ఉక్రెయిన్ సైనికులకు రష్యా అల్టిమేటం