కాలేజీకి వెళ్లే యువతులకు స్కూటీలు ఇస్తం

కాలేజీకి వెళ్లే యువతులకు స్కూటీలు ఇస్తం

ఉత్తరప్రదేశ్ లో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ తమ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో జరిగే ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి ప్రముఖ్యులు ఇంటింటి ప్రచారం సైతం చేస్తున్నారు. తొలి దశ ఓటింగ్ 10న జరగబోతున్న నేపథ్యంలో ఇవాళ బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. వాస్తవానికి ఆదివారం నాడే బీజేపీ మేనిఫెస్టో ప్రకటించాల్సి ఉండగా.. ఆ రోజు లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణించడంతో మేనిఫెస్టో విడుదలను వాయిదా వేసింది. ఇవాళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి కలిసి మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.

మేనిఫెస్టోలోని ప్రధానమైన వాగ్దానాలు ఇవే

- ఏటా హోళీ, దీపావళి పండుగ రోజుల్లో ఒక్కో సిలిండర్ చొప్పున ఫ్రీగా అందజేత.

- 60 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రజా రవాణాలో ఉచిత ప్రయాణం.

- కాలేజీకి వెళ్లే యువతులకు ఉచితంగా స్కూటీలు.

- వితంతు పెన్షన్ 1,500 రూపాయలకు పెంపు.

- లవ్ జీహాద్ కేసుల్లో దోషులుగా తేలితే పదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా.

- రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు చేయడం.

- రాష్ట్రంలోకి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం.

మరిన్ని వార్తల కోసం..

మూడు సిలిండర్లు ఫ్రీ.. పెట్రోల్ రేట్లు పెంచం

మంచు కొండలు విరిగిపడి.. ఏడుగురు సైనికుల మృతి

తెలుగు సీఎంను కాంగ్రెస్ పార్టీ అవమానించింది