సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్

సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు. ఆగస్టు 15 లోపు రూ.  39 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తావా అని ప్రశ్నించారు.  ఇప్పటివరకు రైతుబంధు పూర్తిగా ఇవ్వలేదు కానీ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అంటున్నాడని ఎద్దేవా చేశారు.  మీరిచ్చిన ఆరు గ్యారెంటిలే  ఈ పార్లమెంట్ ఎన్నికల్లో  మీకు భస్మాసురహస్తం అవుతాయని హరీష్ రావు హెచ్చరించారు.  సంగారెడ్డి జిల్లా కొండాపూర్ లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో హరీష్ రావు సమావేశం నిర్వహించారు.  

రైతురుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి బోనస్, ఆసరా పెన్షన్ పెంపు, మహిళలకు 2,500 రూపాయల సహయం, కళ్యాణాలక్ష్మి కి తులం బంగారం, నిరుద్యోగ భృతిపై మాట తప్పినందుకు కాంగ్రెస్ ని ఓడించాలన్నారు హరీష్ రావు.  రేవంత్ రెడ్డి అంటే మాటల కోతలు..కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలని విమర్శించారు.  నాలుగున్నర నెలల్లోనే సీఎం ఏదేదో చేసినట్టు ఓటేయకపోతే పథకాలు బంద్ అవుతాయని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని హరీష్ మండిపడ్డారు.  

also read : ప్రతి ఒక్క నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాం : గడ్డం వంశీకృష్ణ

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయన్నారు హరీష్ రావు.   కాంగ్రెస్ అంటే కరువు, కరెంట్ కోతలు, మంచినీళ్ల కష్టాలు, అవినీతి అని విమర్శించారు హరీష్ రావు.  2014, 2019 రెండు సార్లు దేశంలో  కాంగ్రెస్ కి ప్రతిపక్ష హోదా దక్కలేదని...  మీ పాలన వద్దని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు.  మెడలో పేగులేసుకుంటా,మానవ బాంబునై పేలుతా, డ్రాయర్ ఊడగొడుతా అంటూ సీఎం పదవికి అర్థం లేకుండా రేవంత్  మాట్లాడుతున్నారని చెప్పారు హరీష్.