లో బడ్జెట్ ఫోన్ల పై బంపర్ ఆఫర్స్

లో బడ్జెట్ ఫోన్ల పై బంపర్ ఆఫర్స్

ఆఫర్ల పండుగ వచ్చేసింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ స్పెషల్ సేల్ సందడి మొదలైంది. అనుకున్న బడ్జెట్ లో.. మంచి ఆఫర్ తో.. ఎంఆర్పీపై భారీ తగ్గింపుతో.. స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికిదే మంచి టైమ్.

SBI, HDFC బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది అమెజాన్.

ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు కార్డులు ఉన్న వారికి ఫ్లిప్ కార్ట్ లో భారీగా ఆఫర్లు ఉన్నాయి. వీటితో పాటు నో కాస్ట్ ఈఎంఐ, పాత ఫోన్ ఎక్సేంజ్, అదనపు వారెంటీలు, ఇన్సూరెన్స్ ఆఫర్లు ఇచ్చాయి.

అమెజాన్ లో బడ్జెట్ ఫోన్లపై కొన్ని ఆఫర్లు ఇవీ:

శాంసంగ్ గెలాక్సీ ఎమ్10

శాంసంగ్ గెలాక్సీ ఎమ్10 ఫోన్ పై భారీ ఆఫర్ ప్రకటించింది అమెజాన్. రూ.9290 ఉన్న ఈ ఫోన్ ను ఆఫర్లో రూ.7999కే అందిస్తోంది. ఈఎంఐలలో అయితే రూ.377 నుంచి తక్కువ మొత్తాల్లో నెలవారీ వాయిదాలు చెల్లించేలా ఆఫర్ పెట్టింది. 6.22 అంగులాల హెచ్ డీ ఇన్ఫినిటీ వీ డిస్ల్పే దీని స్లెషాలిటీ. అమెజాన్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో ఇదే బెస్ట్ సెల్లింగ్ ఫోన్ అని ఆ సంస్థ చెబుతోంది.

రెడ్ మీ వై3

రూ.11,999 ఉన్న రెడ్ మీ వై3 ఫోన్ ను ఏకంగా నాలుగు వేలు తగ్గింపుతో రూ.7,999 అందిస్తోంది. 32 ఎంపీ సెల్ఫీ స్నాపర్ కెమెరాతో పాటు, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ దీని ప్రత్యేకతలు. అమెజాన్ లో ఈ ఫొన్ కొనుగోలుపై పాత ఫొన్ ఎక్సేంజ్ తో గరిష్ఠంగా రూ.7400 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎమ్20

శాంసంగ్ గెలాక్సీ ఎమ్20 ఫోన్ ను అమెజాన్ రూ.9999కి అందిస్తోంది. దీని అసలు ధర రూ.11290గా ఉంది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. రూ.564 ఈఎంఐతో ఈ ఫోన్ బుక్ చేసుకోవచ్చు.

రియల్ మీ యూ1

ఏకంగా రూ.4 వేల డిస్కౌంట్ ప్రైస్ తో రియల్ మీ యూ1 ఫోన్ ను అందుబాటుకి తెచ్చింది అమెజాన్. రూ.12999 ఉన్న ఈ ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్ లో రూ.7999కే వస్తోంది. 25 ఎంపీ సెల్ఫీ కెమెరా దీని స్పెషాలిటీ. ఇలా బోలెడన్ని బడ్జెట్ ఫోన్లను భారీ ఆఫర్లతో అమెజాన్ అందుబాటులోకి తెచ్చింది.

ఫ్లిప్ కార్ట్ లో కొన్ని లో బడ్జెట్ ఫోన్లు:

రెడ్ మీ నోట్ 7ఎస్

రెడ్ మీ నోట్ 7స్ ఫోన్ ను రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంచింది ఫ్లిప్ కార్ట్. రామ్ – 3జీబీ, ఇంటర్నల్ మెమొరీ 32 జీబీ ఉన్న ఫోన్ అయితే రూ.11999 నుంచి రూ.8999కి తగ్గించి అందిస్తోంది. 4 జీబీ రామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ వేరియంట్ ఫోన్ రూ.13999 కాగా, దాన్ని రూ.9999కే ఆఫర్ లో ఇస్తోంది.

 రియల్ మీ 5

రూ.11999 ఉన్న రియల్ మీ 5 ఫోన్ ను రూ.8999కే అందిస్తోంది ఫ్లిప్ కార్ట్. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ దీని స్పెషాలిటీ.

 రియల్ మీ 2 ప్రో

రూ.13999 ఉన్న రియల్ మీ 2 ప్రో ను రూ.8999కి ఆఫర్లో ఇస్తోంది ఫ్లిప్ కార్ట్. 16 ఎంపీ సెల్ఫీ కెమెరా దీని స్పెషాలిటీ.

నోకియా 6.1 ప్లస్

నోకియా 6.1 ప్లస్ ఫోన్ ను ఏకంగా సగం ధరకే ఇస్తోంది ఫ్లిప్ కార్ట్. రూ.17600 ఫోన్ కేవలం 8999 రూపాయలకే వస్తోంది. దీని రామ్ 4 జీబీ, ఇంటర్నల్ మెమొరీ 64 జీబీగా ఉంటాయి.