ఆన్ లైన్‌లో చైల్డ్​ పోర్నోగ్రఫీ.. 14 రాష్ట్రాల్లో సోదాలు

ఆన్ లైన్‌లో చైల్డ్​ పోర్నోగ్రఫీ.. 14 రాష్ట్రాల్లో సోదాలు

న్యూఢిల్లీ: ఆన్​లైన్​లో చైల్డ్​ పోర్నోగ్రఫీని అడ్డుకోవడానికి సెంట్రల్ ​బ్యూరో ఆఫ్​ ఇన్వెస్టికేషన్(సీబీఐ) చర్యలు ప్రారంభించింది. ఆన్​లైన్​లో పిల్లలను లైంగికంగా వేధిస్తున్న, చైల్డ్​ పోర్నోగ్రఫి, పిల్లల​ అబ్యూసివ్​ వివరాలు పోస్ట్​ చేస్తున్న  83 మందిని ప్రాథమికంగా గుర్తించింది. నవంబర్​14న వారిపై వేర్వేరు కేసులు నమోదు చేసిన సీబీఐ మంగళవారం నిందితుల కోసం  గాలింపు మొదలుపెట్టింది. 

దేశవ్యాప్తంగా 76 ప్రాంతాల్లో..
చిన్నారుల పోర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీడియోల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూడటం, డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం లాంటివి చట్టరీత్యా నేరం. కాగా చైల్డ్ ​పోర్నోగ్రఫి సర్క్యులేట్​చేస్తున్న 83 మంది నిందితుల కోసం సీబీఐ అధికారులు మంగళవారం దేశవ్యాప్తంగా14 రాష్ట్రాల్లోని 76 ప్రాంతాల్లో సెర్చ్​ ఆపరేషన్​ చేపట్టారు. ఏపీ, ఢిల్లీ, యూపీ, పంజాబ్, బిహార్, ఒడిశా, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, చత్తీస్​గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్​ప్రదేశ్ రాష్ట్రాల్లో సెర్చ్​ ఆపరేషన్ ​చేపట్టినట్లు సీబీఐ ప్రతినిథి ఆర్సీ జోషి తెలిపారు.