7 రోజుల క్వారంటైన్ డబ్బులు తిరిగి ఇచ్చేయాలి

7 రోజుల క్వారంటైన్ డబ్బులు తిరిగి ఇచ్చేయాలి

విదేశాల నుంచి వచ్చేవారి ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ ను 7 రోజులకు తగ్గించినందున… వారి నుంచి 14 రోజులకు వసూలు చేసిన డబ్బులో సగం తిరిగిచ్చేయాలని.. రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. దీనిపై రాష్ట్రాల సీఎస్ లకు లెటర్ రాశారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా. విదేశాల నుంచి వచ్చినవారు హోటల్స్ లో ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. దీనికోసం 14రోజులకు సరిపడా ఛార్జీలు ముందుగానే వసూలు చేశారు.

అయితే క్వారంటైన్ ను 7రోజులకు కుదించినందున… మిగతా 7రోజులకు సంబంధించిన డబ్బును రీఫండ్ చేయాలని సూచించారు. ఎవరైనా 14 రోజులు హోటల్స్ లోనే క్వారంటైన్ లో ఉండాలనుకునేవారు అలాగే చేయవచ్చు. లేదంటే 7 రోజుల తర్వాత ఇంటికెళ్లి… అక్కడ మరో 7 రోజులు క్వారంటైన్ లోనే ఉండాలి. ఇక హోటళ్లలో ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ ఛార్జీలు కూడా మారాయి. గతంలో 14 రోజులకు 15వేలు, 30వేలతో రెండు ప్యాకేజీలు ఉండేవి. ఇప్పుడు 7 రోజులకు 8వేలు, 16వేలతో రెండు కొత్త ప్యాకేజీలు ప్రకటించింది కేంద్రం.

For More News..

నచ్చిన కోర్సులో సీటు రాక.. ఇష్టంలేని కోర్సు చదవలేక..

భూములు పాయే..  ప్రాజెక్టు పాయే.. కొలువులు రాకపాయే..

రూ. 170 కోసం దోస్తుల గొడవ.. ఒకరి మృతి