సహస్రాబ్ది ఉత్సవాల పదో రోజు కార్యక్రమాలు

సహస్రాబ్ది ఉత్సవాల పదో రోజు కార్యక్రమాలు

రంగారెడ్డి: శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పదో రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సామూహిక ఉపనయనాలు, అనంతరం విద్యా ప్రాప్తికై హయగ్రీవ ఇష్టి నిర్వహించారు.108  దివ్య దేశాలలోని 36 ఆలయాల్లో ప్రాణ ప్రతిష్ఠ, కుంభాభిషేకం, మహా సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతోంది. మధ్యాహ్నం 12.30 గంటలకు పూర్ణాహుతి, 2.30 గంటలకు ప్రముఖులచే ప్రవచనాలు, కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ మహాయజ్ఞం, రాత్రి 9గంటలకు పూర్ణాహుతి జరగనుంది. 

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. సమతామూర్తితో పాటు దివ్యదేశాలను సందర్శించనున్నారు. అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంత స్వామీజీ, ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తదితరులు ఈ రోజు సమతామూర్తిని దర్శించుకోనున్నారు. 

For more news..

నేను జాతకాన్ని, అదృష్టాన్ని ఒక శాతం మాత్రమే నమ్ముతాను

యాప్‌లు ఇచ్చే లోన్లపై త్వరలో గైడ్‌లైన్స్‌