జీ20లో ఏయూ చేరికపై.. మాకెలాంటి అభ్యంతరం లేదు : చైనా

జీ20లో ఏయూ చేరికపై.. మాకెలాంటి అభ్యంతరం లేదు : చైనా

బీజింగ్: ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ)ను జీ20లో చేర్చడానికి తమకేం అభ్యంతరం లేదని చైనా స్పష్టం చేసింది. ఏయూను చేర్చుకోవడంపై మద్దతు ప్రకటిస్తున్న మొదటి దేశంగా చైనా నిలుస్తుందని తెలిపింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. జీ20లో ఆఫ్రికన్ యూనియన్​కు సభ్యత్వం ఇచ్చేందుకు చైనా మద్దతు ఇస్తుందని ఇటీవల చైనా, ఆఫ్రికా నేతల మధ్య జరిగిన చర్చల్లో జిన్​పింగ్ అన్నట్లు మావోనింగ్ వివరించారు. 

జీ20లో ఆఫ్రికన్ యూనియన్​కు సభ్యత్వం ఇస్తే భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో సమానత్వం, న్యాయాన్ని కాపాడటంలో ఏయూ, చైనా మంచి భాగస్వాములు అవుతాయని వివరించారు. గ్లోబల్ గవర్నెన్స్​లో కీలక పాత్ర పోషించడంలో తాము ఏయూకి సపోర్ట్ ఇస్తున్నామని తెలిపారు.