ఫుట్ బాల్ ఆసియా కప్ నిర్వహణపై చైనా వెనుకడుగు

ఫుట్ బాల్ ఆసియా కప్ నిర్వహణపై చైనా వెనుకడుగు

2023 సంవత్సరంలో జరగాల్సిన ఆసియా కప్ ఫుట్ బాల్ ఫైనల్స్ టోర్నీ విషయంలో చైనా బ్యాక్ స్టెప్ వేసింది. టోర్నీ ఫైనల్స్ నిర్వహణ నుంచి తప్పుకుంటున్నట్లు చైనా స్పష్టం చేసింది. ఆసియన్ ఫుట్ బాల్ సంఘం శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఈ టోర్నీ నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. 2023 జూన్ 16వ తేదీ నుంచి జూలై 16వ తేదీ వరకు చైనాలో నిర్వహించాల్సి ఉంది. తాజాగా..చైనా కోవిడ్ వైరస్ తో భయపడుతోంది. కేసులు వెలుగులోకి వస్తుండడంతో కఠినమైన ఆంక్షలు విధిస్తోంది అక్కడి ప్రభుత్వం.

షాంఘైలో ఓ నెల పాటు తీవ్రమైన ఆంక్షలు ఎదుర్కొన్నారు ప్రజలు. జీరో కోవిడ్ వ్యూహంతో అక్కడి అధికారులు ముందుకెళుతున్నారు. వైరస్ ను పూర్తిగా తొలగించే పనిలో పడ్డారు. ఇందులో లాక్ డౌన్ లు విధించడంతో పాటు మాస్ టెస్టింగ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఫుట్ బాల్ ఫైనల్ టోర్నీని తాము నిర్వహించలేమని చైనా ఫుట్ బాల్ అధికారులు AFCకి తెలియచేశారు. కోవిడ్ కారణంగా నెలకొన్న పరిస్థితులను ఏఎఫ్‌‌సీ గుర్తించింది. అందుకే టోర్నీ నిర్వహణ విషయంలో చైనా వెనుకడుగు వేసిందని వెల్లడించింది. నిర్ణయం కష్టమైనా.. అవసరమని భావిస్తున్నట్లు తెలిపింది.

కోవిడ్ ఎఫెక్ట్ క్రీడలపై ప్రభావం చూపెడుతోంది. పారాలింపిక్ క్రీడలు ఆగస్టు 24వ తేదీ నుంచి సెప్టెంబర్ 05 వరకు జరుగనున్నాయి. ఈ క్రీడలు కిందటి సంవత్సరమే జరగాల్సి ఉండగా.. కోవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి. ఇక ఫుట్ బాల్ ఆసియా కప్ లో మొత్తం 24 దేశాలు పాల్గొంటాయి. 2019లో ఖతర్ విజయం సాధించింది. 2004లో ఆసియా కప్ కు చైనా అతిథ్యం ఇచ్చింది. అతిథ్య జట్టు ఫైనల్ లో జపాన్ తో జరిగిన మ్యాచ్ లో 3-1 తేడాతో పరాజయం చెందింది. 


మరిన్ని వార్తల కోసం : 

రిటైర్‌‌మెంట్ చేస్తున్నట్లు ట్వీట్.. ఆ వెంటనే డిలీట్


అతను తొందర్లోనే టీమిండియాకు