25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోండి.. లక్ష రూపాయలు తీసుకెళ్లండి

25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోండి.. లక్ష రూపాయలు తీసుకెళ్లండి

పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిలకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. 25 ఏండ్ల లోపు పెళ్లి చేసుకుంటే రూ. లక్ష పైగా బహుమతి ప్రకటించింది. ఆగండి ఆగండి..ఈ ఆఫర్ మన దేశంలో కాదు..చైనాలో .. అక్కడ జననాల సంఖ్య  రోజురోజుకీ తగ్గిపోతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం ఈ  కీలక నిర్ణయం తీసుకుంది.

చైనాలో వధువు వయస్సు 25 ఏళ్లు లేదా  అంతకంటే తక్కువగా ఉంటే వారికి  రూ.11,340 నగదును కానుకగా ఇవ్వనుంది. ఈ మేరకు  చాంగ్‌షాన్ కౌంటీ అధికారికంగా వెల్లడించింది. దీని ప్రకారం  1,000 యువాన్లు అంటే భారత కరెన్సీలో రూ. 11,320.36 ను  రివార్డ్ గా అందివ్వనుంది.  ఈ ప్రోత్సాహంతోనైనా చైనాలో  యువత త్వరగా పెళ్లి చేసుకుంటుందని భావిస్తోంది.

చైనాలో సాధారణంగా పెళ్లి  వయ్సస్సు అబ్బాయికి 22 ఏండ్లు, అమ్మాయికి 20గా అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే చైనాలో పెళ్లి చేసుకునే వారి సంఖ్య  క్రమంగా తగ్గిపోతోంది. 2022లో చైనాలో 68 లక్షల వివాహాలు జరిగాయి. 1986 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో వివాహాలు  నమోదు కావడం ఇదే మొదటి సారి. 2021 కంటే 2022లో 8 లక్షల పెళ్లిళ్లు తక్కువగా అయ్యాయి.

అలాగే జననాల రేటులో ప్రపంచంలోనే అతి తక్కువ స్థానానికి చైనా పడిపోయింది. 2022లో రికార్డ్ స్థాయిలో 1.09గా నమోదు అయింది. చైనాలో పిల్లల సంరక్షణకు అధిక ఖర్చు కావడం వల్ల చాలా మంది మహిళలు ఎక్కువ మంది పిల్లలను కనడం లేదు. మహిళల కెరియర్ నిలిచిపోవడం వల్ల మహిళలు ఎక్కువమంది పిల్లల్ని కనడం ఆపేశారు. దీనికి తోడు చైనా ఆర్ధిక వ్యవస్థ, ఆరోగ్యంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో అక్కడి యువత పెళ్లి పట్ల విముఖత చూపుతున్నట్లు సమాచారం. 

వీటిన్నంటిని దృష్టిలో పెట్టుకుని త్వరగా పెళ్లి చేసుకుని  పిల్లలను కనేలా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఈ  నగదు ప్రోత్సాహం పథకాన్ని అమలు చేయనుంది. పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలతో పాటు..ఆ తర్వాత కూడా పిల్లల సంరక్షణ, విద్య విషయంలోనూ సబ్సీడీలు ఇచ్చి జంటలకు ఆర్థికంగా సహకరించనుంది.