చైనా డిఫెన్స్ మినిస్టర్ తొలగింపు

చైనా డిఫెన్స్ మినిస్టర్ తొలగింపు

బీజింగ్: రెండు నెలలుగా కనిపించకుండా పోయిన రక్షణ మంత్రి జనరల్ లీ షాంగ్ ఫూను చైనా ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. డిఫెన్స్ మినిస్టర్, స్టేట్ కౌన్సిలర్ పదవుల నుంచి ఆయనను తొలగిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. ఇలాగే మూడు నెలల కింద ఫారిన్ మినిస్టర్ కిన్ గాంగ్ కూడా ఇదే విధంగా తొలగించింది. ఇప్పుడు ఆయనను స్టేట్ కౌన్సిలర్ గానూ తొలగిస్తున్నట్టు ప్రకటించింది.

వీళ్లిద్దరి తొలగింపునకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిందని చైనా మీడియా వెల్లడించింది. కొత్త డిఫెన్స్ మినిస్టర్​గా ఇంకా ఎవరినీ నియమించలేదు. కాగా, చైనా అధ్యక్షుడిగా జిన్ పింగ్ అధికారం చేపట్టాక చాలామంది కనిపించకుండా పోతున్నారు. ఆయుధాల కొనుగోలులో అక్రమాలకు సంబంధించి లీ షాంగ్ ఫూను రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం.