భయపెడుతున్న చైనా న్యూమోనియాకు కారకాలు ఇవే..

భయపెడుతున్న చైనా న్యూమోనియాకు కారకాలు ఇవే..

చైనా ఆస్పత్రులు పిల్లలతో నిండిపోయాయి..న్యూమోనియాతో పిల్లలు ఆనారోగ్యం బారినపడి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీనిపై ప్రపచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని చైనా ఇప్పటికే కోరింది.అయితే ఆదివారం (నవంబర్ 26) చైనా న్యూమోనియా వ్యాధికి సంబంధించిన వివరాలను డబ్ల్యూహెచ్ వో కు అందించింది. కరోనా తర్వాత అంతాల భయపెడుతున్న చైనా న్యూమోనియా శ్వాసకోశ వ్యాధుల పెరుగుదల వెనక చాలా కారకాలు న్నాయని చైనా ఆరోగ్య కమిషన్ వెల్లడింది. ఈ వ్యాధి కారకాల కలయికతో దేశవ్యాప్తంగా పిల్లల్లో తీవ్రమైన శ్వాసకోసం ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు కారణమయ్యా యని తెలిపింది. 

పిల్లల్లో న్యూమోనియా కేసులు పెరుగుదలకు ప్రధాన కారణాలలతో ఇన్ ఫ్లుయెంజా ఒకటి అని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రతినిధి తెలిపారు. రైనోవైరస్, మైకోప్లాస్మా న్యూమోనియా, రెస్పిరేటర సిన్సిటియల్ వైరస్  కూడా వ్యాప్తి చెందుతున్నాయని చెప్పారు. మందుల సరఫరా, మరిన్ని వైద్య చికిత్స కేంద్రాలను తెరుస్తున్నట్లు జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. 

శ్వాస కోశ వ్యాధులువ్యా్ప్తి ముఖ్యంగా పిల్లలను ఎక్కువగా ఉంది. ఔట్ పేషెంట్ సంఖ్య, ఆస్పత్రుల్లో పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, బీజింగ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ తెలిపింది. అయితే న్యూమోనియా శ్వాసకోశ వ్యాధి విస్తరణకు కొత్త వైరస్ లు ఏవీ కారణం కాదని స్పష్టం చేసింది. ప్రతి యేటా శీతాకాంలో శ్వాస కోశ వ్యాధులు ప్రబలడం సాధారణం.. ఈ ఏడాది ఎక్కువగా ఉంది. ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చైనా ఆరోగ్య కమిషన్ సూచించింది. ఎటువంటి ప్రయాణ ఆంక్షలు లేవని తెలిపింది. 

గత కొన్ని వారాలుగా న్యూమోనియా కేసులు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చిరిస్తూ వచ్చారు. ప్రాథమిక స్థాయి పాఠశాలల పిల్లల్లో మైకో ప్లాస్మా నుంచి ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్లు చైనీస్ మీడియా నివేదించింది. బలమైన రోగనిరోధక వ్యవస్థలతో ఉన్న పెద్ద పిల్లలు, పెద్దల్లో తేలికపాటి జలుబు మాత్రమే ఉందని.. చిన్న పిల్లలలో న్యూమోనియా పెరిగే అవకాశం ఉందని.. ఇది కొన్ని వారాలపాటు కొనసాగే అవకాశం ఉందని చైనా ఆరోగ్య కమిషన్ పేర్కొంది.