మేం పిల్లలను కనం అంటున్న చైనా మహిళలు.. చరిత్రలో అత్యంత తక్కువ జననాలు

మేం పిల్లలను కనం అంటున్న చైనా మహిళలు.. చరిత్రలో అత్యంత తక్కువ జననాలు

చైనాలో సంతానోత్పత్తి రేటు పడిపోయింది. 2022లో రికార్డు స్థాయిలో 1.09కి పడిపోయిందని నేషనల్ బిజినెస్ తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలో తగ్గుతున్న కొత్త జనానాలల సంఖ్యలను పెంచేందుకు చైనా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 100 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో చైనా అత్యల్ప సంతానోత్పత్తి స్థాయిని కలిగి ఉందని చైనా జనాభా, అభివృద్ధి పరిశోధనా కేంద్రం గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే దక్షిణ కొరియా, తైవాన్, హాంకాంగ్, సింగపూర్లతో పాటు చైనా  సంతానోత్పత్తి రేటులో  వెనకబడి ఉన్నాయి. 
చైల్ట్ కేర్ ఖర్చుల భారం, వారి కేరీర్ వంటి ప్రధాన సమస్యలతో చాలా మంది చైనా మహిళలు ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ఇష్టపడటం లేదు. లింగ వివక్ష, పిల్లలను సాకడంతో మహిళల సాంప్రదాయ మూస పద్దతులు దేశవ్యాప్తంగా ఇప్పటికీ విస్తృతంగా ఉండటమే ఇందుకు మరో కారణం. అయితే ఇటీవలీ కాలంలో పిల్లల పెంపకంపై చైతన్య కార్యక్రమాలు చేపట్టింది. చాలా ప్రావిన్సులలో తండ్రులకు సెలవులు తగ్గించింది. 
హాంగ్ కాంగ్ ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియకేషన్ సర్వే ప్రకారం.. గడిచిన ఐదేళ్లలో సంతానం లేని మహిళల సంఖ్య 43.2 శాతానికి రెండింతలు పెరిగింది. ఒకటి లేదా ఇద్దరు పిల్లలున్న జంటల శాతం కూడా గణనీయంగా పడిపోయింది. సగటున ఒక మహిళకు పిల్లల సంఖ్య 2017 నుంచి ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 1.3 నుంచి 09 కి పడిపోయింది. 
గడిచిన ఆరు దశాబ్దాల్లో జనాభా తగ్గుదల, పెరుగుతున్న వృద్ధాప్య జనాభా చైనాను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అందుకోసం చైనా ప్రభుత్వం  మెరుగైన పిల్లల సంరక్షణ సౌకర్యాలతో పాటు జనన రేటును పెంచేందుకు ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం అనేక ఆర్థిక ప్రోత్సహకాలను ప్రకటించింది. 
2023 మేలో సంతానోత్పత్తిపై అధ్యక్షుడు జి జిన్ పింగ్ అధ్యతక్షన సమావేశం జరిగింది. జనాభా నాణ్యత, విద్య, సైన్స్, టెక్నాలజీపై దృష్టి, భవిష్యత్తులో ఆర్థిక వృద్ధికి తోడ్పాటుకు అవసరమైన సంతానోత్పత్తి స్థాయిని కొనసాగించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు చైనా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.