చైనా స్టూడెంట్ల వాటర్ రాకెట్..ప్రయోగం సక్సెస్.. వీడియో వైరల్

చైనా స్టూడెంట్ల వాటర్ రాకెట్..ప్రయోగం సక్సెస్.. వీడియో వైరల్
  • విజయవంతంగా ప్రయోగం

బీజింగ్: చైనా విద్యార్థులు రెండు దశల వాటర్ రాకెట్‌‌ను విజయవంతంగా ప్రయోగించారు. నీళ్లు, కోకాకోలా బాటిల్​తో రూపొందించిన ఈ రాకెట్ అత్యంత కచ్చితత్వంతో పైకెగిరింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

పిల్లలు ఇంట్లోనే సొంతంగా తయారు చేసిన ఈ రాకెట్ భారీఫోర్స్​తో ఆకాశంలోకి దూసుకెళ్లడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రాకెట్ ప్రయాణం రెండో దశలో విడిపోయిన బాటిల్స్ కిందపడగా, మిగతా భాగం ఆకాశంలోకి వెళ్లింది. 

విద్యార్థులు ఫిజిక్స్ నియమాలను ఉపయోగించి సమన్వయం, కచ్చితత్వంతో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఆకాశంలోకి వెళ్లిన రాకెట్​ను ప్యారాచూట్ సాయంతో సేఫ్​గా నేలపైకి దిగేలా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. దాదాపుగా 12 లక్షల మంది దీనిని చూశారు.