రాళ్లు విసురుకున్న BJP, TMC కార్యకర్తలు.. 11 గంటలకు 32 శాతం ఓటింగ్

రాళ్లు విసురుకున్న  BJP, TMC కార్యకర్తలు..  11 గంటలకు 32 శాతం ఓటింగ్

దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో 102 లోక్ సభ నియోజకవర్గాల్లో శుక్రవారం ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని పోలింగ్ అధికారి తెలిపారు.  అక్కడక్కడా కొన్నిచోట్ల అల్లర్లు జరిగాయి. మావోయిస్టుల ప్రభావం ఎక్కువ ఉండే వెస్ట్ బెంగాల్ లో ఉదయం 11 గంటల వరకు 32 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. కూచ్‌బెహార్‌లోని దిన్‌హటా గ్రామంలో పోలీసులు బాంబ్ స్వాధీనం చేసుకున్నారు. 

ఆ ప్రాంతంలోని బీజేపీ బూత్ అధ్యక్షుడి ఇంటిపై తృణమూల్ కార్యకర్తలు బాంబులు విసిరారని కూడా ఆరోపణలున్నాయి. BJP, TMC కార్యకర్తలు రాళ్లు విసురుకొని దాడులు చేసుకున్నారు. నిషిత్ ప్రమాణిక్ తన అధికారాన్ని ఉపయోగించుకుని పార్టీ కార్యాలయంలో ఆయుధాలు భద్రపరుచుకుంటున్నారని ఆరోపిస్తూ అధికార TMC ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. తమిళనాడు రాష్ట్రంలో పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.