స్పెషల్ ఆఫీసర్లు గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి : ఇలా త్రిపాఠి

స్పెషల్ ఆఫీసర్లు గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి : ఇలా త్రిపాఠి

ములుగు, వెలుగు : జిల్లాలోని పంచాయతీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి ప్రత్యేకాధికారులకు సూచించారు.   సోమవారం ములుగులోని డీఎల్​ఆర్​ ఫంక్షన్​ హాల్​లో గ్రామాల స్పెషల్ ఆఫీసర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రత్యేకాధికారులు.. ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు పారిశుధ్య డ్రైవ్​ నిర్వహించాలని సూచించారు. గ్రామాలలో పంచాయతీ కార్యదర్శుల విధి నిర్వహణ బాధ్యతలు అభినందనీయమని, నూతనంగా వచ్చిన ప్రత్యేక అధికారులకు సహకరిస్తూ గ్రామీణ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.

కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) పి.శ్రీజ, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, డీఎంహెచ్ఓ అప్పయ్య, జడ్పీసీఈఓ ప్రసూన రాణి, ఎస్సీ డెవలప్మెంట్ ఈడీ తుల రవి, మత్స్యశాఖ అధికారి శ్రీపతి పాల్గొన్నారు. అలాగే.. ములుగు పంచాయతీ పరిధి ప్రేమ్​ నగర్​ వద్ద నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ పనులను నాలుగు జిల్లాల మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్​ తో కలిసి కలెక్టర్​ పరిశీలించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మెడికల్​ కాలేజీ తరగతులు ప్రరంభమవుతాయన్నారు. 

Also Read : డబుల్ ఇండ్ల అక్రమాలపై చర్యలు తీసుకోవాలి : రామచంద్రు నాయక్