బాల్క సుమన్​ దిష్టిబొమ్మ దహనం

బాల్క సుమన్​ దిష్టిబొమ్మ దహనం

ఆమనగల్లు, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామంలో కాంగ్రెస్  నాయకులు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్  దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, వెంటనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బాల్క సుమన్​ను వెంటనే అరెస్ట్​ చేయాలని కోరారు. హరి మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, పెంటయ్య, జంగయ్య, జంగిలి, నరసింహ పాల్గొన్నారు.