ధర్మారంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఘన సన్మానం

ధర్మారంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఘన సన్మానం

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి మొదటి సారి వచ్చిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ జిల్లా నాయకులు కాడే సూర్యనారాయణ, దేవి జనార్ధన్, కాంగ్రెస్ నాయకులు శాలువాతో సత్కరించారు.

అనంతరం ధర్మారంలో గత నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన ఎలగందుల రాజేశం కుటుంబ సభ్యులను వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు.