చైనాకు ఇంపోర్ట్ అయిన చికెన్‌ ముక్కలపై కరోనా

చైనాకు ఇంపోర్ట్ అయిన చికెన్‌ ముక్కలపై కరోనా

ఈక్వెడార్ రొయ్యల ప్యాకెట్లపైన కూడా వైరస్
ఇంపోర్టెడ్ ఫుడ్‌పై గుర్తించామన్న చైనా అధికారులు

బీజింగ్: బ్రెజిల్ నుంచి చైనాకు ఇంపోర్ట్ అయిన ఫ్రోజెన్ చికెన్ పై కరోనా వైరస్ ఉన్నట్లు చైనీస్ అధికారులు వెల్లడించారు. బ్రెజిల్ లోని ఆరోరా అలిమెంటోస్ ప్లాంటు నుంచి చైనాలోని షెంజెన్ సిటీకి ఇంపోర్ట్ అయిన ఫ్రోజెన్ చికెన్ వింగ్స్ కు అధికారులు టెస్టులు చేశారు. దీంతో ఓ ప్యాకెట్ లోని చికెన్ వింగ్స్ పై కరోనా ఉన్నట్లు బుధవారం కన్ఫమ్ అయింది. వైరస్ ఉన్నట్లు తేలిన ఫుడ్ ఏ కంపెనీ నుంచి వచ్చిందన్నది అధికారులు బయటపెట్టలేదు. కానీ ఆ బ్రాండ్ కు చెందిన ఇంపోర్టెడ్ ఫుడ్ ప్యాకెట్లన్నింటినీ స్క్రీనింగ్ చేస్తున్నారు. ఆ ఫుడ్ ప్యాకెట్లతో కాంటాక్ట్ అయినవారు, వాటిని కొన్నవారిని సైతం ట్రేస్ చేస్తున్నారు. కరోనా ఉన్నట్లు తేలిన ఫుడ్ ప్యాకెట్ తో కాంటాక్ట్ అయిన వారందరికీ టెస్టులు చేయగా నెగెటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు.

ఈక్వెడార్ రొయ్యల ప్యాకెట్ల పైనా..
చైనా అన్హుయి ప్రావిన్స్ లోని ఓ రెస్టారెంట్ కు ఈక్వెడార్ నుంచి ఇంపోర్ట్ అయిన మూడు రొయ్యల ప్యాకెట్ల పైనా కరోనా ఉన్నట్లు బుధవారం కన్ఫమ్ అయింది. ఇంపోర్టెడ్ ఫుడ్ పై చైనీస్ అధికారులు జూన్ నుంచే నిఘా పెట్టారు. దేశంలోకి వస్తున్న ఇంపోర్టెడ్ ఫుడ్ కు తరచూ కరోనా టెస్టులు చేస్తున్నారు. చైనాలో గత జులై నుంచి ఇంపోర్టెడ్ సీ ఫుడ్ ప్యాకెట్లపై కరోనా పాజిటివ్ గా రావడం ఇది ఏడోసారి.

ఇంపోర్టెడ్, సీ ఫుడ్ తో జాగ్రత్త..
చైనాలో వరుసగా ఇంపోర్టెడ్, సీ ఫుడ్ పై కరోనా ఉన్నట్లు తేలుతుండటంతో ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాల నుంచి ఇంపోర్ట్ అయ్యే ఫుడ్ ప్యాకెట్లను కొనేటప్పుడు, వాడేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది. ఇంపోర్టెడ్ మాంసంతో పాటు చేపలు, ఇతర ఆక్వా, సీ ఫుడ్ పై వైరస్ ఉండే చాన్స్ ఉందని తెలిపింది.

ఫుడ్ ద్వారా సోకే చాన్స్ లేదు: ఎక్స్ పర్స్ట్
ఫుడ్ ద్వారా కరోనా సోకుతుందనేందుకు ఇప్పటిదాకా సరైన ఎవిడెన్స్ దొరకలేదని డబ్ల్యూహెచ్ వో, యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు ఇదివరకే ప్రకటించారు. కరోనా ప్రధానంగా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు లేదా మాట్లాడినప్పుడు వెలువడే తుంపరల ద్వారానే ఇతరులకు వ్యాపిస్తుందని చెప్పారు. కరోనా ఉన్నవస్తువులను తాకి, నోరు, ముక్కు లేదా కళ్లను తాకినప్పుడు కూడా వైరస్ వ్యాపించే అవకాశం ఉన్నప్పటికీ, ఫుడ్ ద్వారా కరోనా సోకేందుకు చాన్స్ చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు.

For More News..

అమెరికా రండి.. జాబ్‌ చేసుకోండి

ప్రధానిగా మోడీ కొత్త రికార్డు