అక్కడ డిసెంబర్ లోనే కరోనా !

అక్కడ డిసెంబర్ లోనే కరోనా !
  • పారిస్ డాక్టర్ల స్టడీలో ఆసక్తికర అంశాలు

పారిస్ : కరోనా కలవరం ఫ్రాన్స్ లో డిసెంబర్ లోనే స్టార్ట్ అయ్యిందంట. అక్కడ ఫస్ట్ కేసును కనుగొన్న దానికి నెల ముందు నుంచే కరోనా వ్యాప్తి చాపకింద నీరులా కొనసాగుతుందంట. ఈ విషయాన్ని పారిస్ కు చెందిన డాక్టర్ యూవ్ కోహెన్ టీమ్ గుర్తించింది. పేషెంట్ జీరో జాడ కోసం ఈ డాక్టర్ టీమ్ ఓ స్టడీ చేసింది. ఈ స్టడీలో భాగంగా గతేడాది డిసెంబర్ 27 నాటికే ఫ్రాన్స్ లో కరోనా వ్యాప్తి మొదలైనట్లు గుర్తించారు. ఈ స్టడీలోని పలు కీలక అంశాలను ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ యాంటీమైక్రోబియల్‌ ఏజెంట్స్‌ లో పేర్కొ్న్నారు. పారిస్‌లోని అవిసెనె అండ్‌ జీన్‌ వెర్డీర్‌ హాస్పిటల్ లో డిసెంబర్ 2 నుంచి జనవరి 16 వరకు ఇన్ ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలతో ట్రీట్ మెంట్ తీసుకున్న వారి శాంపిల్స్ ను టెస్ట్ చేశారు. వారిలో 42 ఏళ్ల ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు. ఇతను డిసెంబర్ 27 న హాస్పిటల్ లో చేరాడు. విచిత్రమేమిటంటే అతనికి చైనా ట్రావెల్ హిస్టరీ కూడా లేదు. అంటే డిసెంబర్ 27 న నాటికే కరోనా ఇతరుల ద్వారా ఆ పేషెంట్ కు సోకినట్లు చెబుతున్నారు. ఫ్రాన్స్ ఫస్ట్ కరోనా కేసును జనవరి 24 న నమోదైనట్లు ప్రకటించింది. కానీ అప్పటికే కరోనా వ్యాప్తి దేశంలో కొనసాగుతుందని డాక్టర్ కోహెన్ చెప్పారు. చాలా మందికి కరోనా సోకిందన్న విషయం కూడా తెలియదంట. యూరోప్ లోనూ చాలా దేశాల కరోనా కేసులను గుర్తించే నాటికే అక్కడ వైరస్ వ్యాప్తి చెందిందని అంచనా వేస్తున్నారు. యూరోప్ కంట్రీస్ కూడా జనవరి చివరి నాటి నుంచి కరోనా కేసులు గుర్తించాయి. కానీ అప్పటికే చాలా దేశాల్లో కరోనా వ్యాప్తి మొదలై ఉంటుందని చెబుతున్నారు.