ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 22వేల 785 కరోనా టెస్టులు చేయగా కొత్తగా 749 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ముగ్గురు కోవిడ్ కారణంగా చనిపోయారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 6వేల 271 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,28,31,785 కరోనా టెస్టులు చేశారు. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14,697 కి పెరిగింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,12,778.
రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,79,152. రాష్ట్రంలో ప్రస్తుతం 18వేల 929 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. శనివారంతో పోలిస్తే ఆదివారం కరోనా కేసులు, మరణాల సంఖ్య తగ్గింది. అటు దేశంలోనూ కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 45వేలకు తక్కువగానే కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం 14.50 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా.. 44వేల 877 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.
ఇవి కూడా చదవండి:
